China Fire: దారుణం..చైనా రెస్టారెంట్లో అగ్నిప్రమాదం 17 మంది మృతి?
ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల బారినపడి ఎంతోమంది
- By Anshu Published Date - 03:57 PM, Wed - 28 September 22

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఎన్నో రకాల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రమాదాల బారినపడి ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు ప్రమాదాల బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య 100కు పైగా ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందులో కొన్ని వాహన ప్రమాదాలు అయితే మరికొన్ని అగ్ని ప్రమాదాలు. ఈ అగ్ని ప్రమాదాలకు అనేక రకాల కారణాలు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల అలాగే, సిలిండర్ పేలడం వల్ల ఇలా పలు కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
అయితే ఈ అగ్ని ప్రమాదాల బారిన పడ్డారు అంటే ప్రాణాల మీద అసలు వదులుకోవాల్సిందే అని చెప్పవచ్చు. ఎవరో కొంతమంది మాత్రమే అదృష్టవశాత్తు ప్రాణాలతో బతికి బయటపడుతూ ఉంటారు. కానీ అప్పటికే వారి శరీరం అంతా కాలిపోయి ఉంటుంది. నిత్యం ఏదో ఒక ప్రదేశంలో ఈ అగ్ని ప్రమాదాల సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కూడా ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంలో ఏకంగా 17 మంది మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చైనాలో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది మరణించారు. అలాగే ముగ్గురు గాయాల పాలయ్యారు. బిలిన్ రాష్ట్ర రాజధాని చాంగ్చున్లోని ఓ రెస్టారెంట్లో బుధవారం మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కాస్త వేగంగా వ్యాపి చెందడంతో అక్కడే ఉన్న 17 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అలాగే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏంటా అని ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు.