Bihar Viral News: సోదరుడు అక్రమ సంబంధం, తల్లిదండ్రులు అరెస్ట్, కొడుకు సూసైడ్
సోదరుడి నేరానికి తల్లిదండ్రులు జైలుకు వెళ్లడాన్ని యువకుడు చూడలేకపోయాడు, ఆపై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన బీహార్ లో జరిగింది. యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 03:00 PM, Sat - 10 August 24

Bihar Viral News: తల్లిదండ్రులు జైలుకు వెళ్లారనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక సంఘటన బీహార్ లో చోటు చేసుకుంది. దుఖన్ దాస్ కుమారుడు ధర్మేంద్ర కుమార్ అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో జెహనాబాద్ జిల్లా చమన్‌బిగహా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ధర్మేంద్ర కుమార్ సోదరుడు డూడూ కుమార్ ఒక గ్రామ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజుల క్రితం సదరు యువతి, డూడూ కుమార్ ఇంటి నుండి పారిపోయారు, ఆ తర్వాత అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు డూడూ కుమార్ మరియు అతని తల్లిదండ్రులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో పోలీసులు డూడూ కుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అతని తల్లిదండ్రులు జైలుకెళ్లడం మరో కుమారుడు ధర్మేంద్ర కుమార్‌పై తీవ్ర ప్రభావం చూపింది మరియు అతను నిరాశకు గురయ్యాడు. అంతిమంగా ఈ మానసిక ఒత్తిడి అతన్ని ఆత్మహత్యకు దారి తీసింది.
గతంలో కూడా యువతి, డూడూ కుమార్ పారిపోయారని, ఆ తర్వాత గ్రామంలో పంచాయితీ జరిగిందని చెబుతున్నారు. పంచాయితీ నిర్ణయం మేరకు ఇద్దరినీ వారి వారి ఇళ్లకు పంపించారు. అయితే ఈ సంఘటన జరిగిన పది రోజుల తర్వాత వారిద్దరూ మళ్లీ పరారీలో ఉన్నారు, దీంతో బాలిక తండ్రి కేసు పెట్టాడు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకుని నిందితుడు డూడూ కుమార్‌తో పాటు అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పోలీసులపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. కదౌనా పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సబ్-ఇన్‌స్పెక్టర్ హరిహర్ దాస్ కేసును మూసివేయడానికి రూ. 50,000 లంచం డిమాండ్ చేశాడని మృతుడి కుటుంబ సభ్యుడు ఫేకన్ దాస్ చెప్పారు. ఈ నిరుపేద కుటుంబం డబ్బులు చెల్లించలేక పోవడంతో పోలీసులు కఠిన చర్యలు తీసుకుని తల్లిదండ్రులను జైలుకు పంపారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనైన ధర్మేంద్ర కుమార్ చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, కధౌనా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం సదర్ ఆసుపత్రికి పంపించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేస్తుండగా, మీడియాకు మొహం చాటేస్తున్నారు. కాగా ఒక వ్యక్తి తప్పిదం కారణంగా ఒక కుటుంబం ఎలా విచ్చిన్నం అవుతుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. అయితే అధికారుల లంచాల సాంప్రదాయం కూడా సమాజానికి మంచిది కాదు. లేనిపోని ఆరోపణలతో ఒక కుటుంబం నాశనం కావడానికి పోలీసులు కూడా ఒక కారణం. ఈ విషాద సంఘటన సమాజాన్ని, ప్రభుత్వాలను మరోసారి ఆలోచించేలా చేసింది.
Also Read: Journalist Yogi Reddy : కూతురికి ఉరేసి తాను ఆత్మహత్య చేసుకున్న జర్నలిస్ట్