Selfiee: సెల్ఫీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయిన యువతీ
Selfie: హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సందర్శనకు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ నుండి వచ్చిన కుటుంబంలో 28 ఏళ్ల రేషు అనే మహిళ, సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తూ కొండపై నుండి 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది
- Author : Sudheer
Date : 27-10-2024 - 10:26 IST
Published By : Hashtagu Telugu Desk
జనాలకు ఈ మధ్యన ఫోటోలు మరియు సెల్ఫీల (Selfiee) మోజు చాలా ఎక్కువైంది. సెల్పీలు, ఫోటోలు, వీడియోలు అంటూ అందరూ తమ గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేసుకుంటున్నారు. అయితే సెల్ఫీల పిచ్చి వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకోవడం, కొంతమంది ఏకంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా ఓ మహిళ సెల్పీ తీసుకుంటూ కొండపై నుంచి పడిపోయిన ఘటన హరిద్వార్ లో చోటు చేసుకుంది.
హరిద్వార్‌లోని మానసా దేవి ఆలయం సందర్శనకు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని ముజఫర్‌నగర్ నుండి వచ్చిన కుటుంబంలో 28 ఏళ్ల రేషు అనే మహిళ, సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదవశాత్తూ కొండపై నుండి 70 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ సంఘటన ఆమె కుటుంబ సభ్యులను మరియు స్థానికులను తీవ్రంగా కలచి వేసింది. సమాచారం అందిన వెంటనే, స్థానికులు మరియు పోలీసులు కలిసి రేషును రిషికేశ్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో, గాయపడిన మహిళను అంబులెన్సులో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

हरिद्वार सेल्फी लेते हुए पहाड़ी से गिरी महिला

मनसा देवी पहाड़ी से नीचे गिरी महिला

गंभीर हालात को देखते हुए हायर सेंटर रेफर

परिजनों के साथ आई थी हरिद्वार pic.twitter.com/6Z8H8btlK2
— जनाब खान क्राइम रिपोर्टर (@janabkhan08) October 26, 2024

Read Also : Raj Pakala : కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. పోలీసుల రైడ్స్