HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Would You Cheat Like This In The Name Of House Rent

HYD : వామ్మో ఇంటి అద్దె పేరుతో ఇలా కూడా మోసం చేస్తారా..? తస్మాత్ జాగ్రత్త !!

HYD : ముఖ్యంగా ఈజీగా ఇల్లు దొరుకుతుందనే ఆశతో ఇంటి కోసం వెతుకుతున్నవారిని టార్గెట్ చేస్తూ స్కామర్లు నకిలీ ప్రకటనలతో మోసం చేస్తున్నారు

  • Author : Sudheer Date : 27-05-2025 - 5:02 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
To Let House Hyd
To Let House Hyd

హైదరాబాద్ (Hyderabad) నగరంలో అద్దె ఇళ్ల (Rental Houses) పేరుతో మోసాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా ఈజీగా ఇల్లు దొరుకుతుందనే ఆశతో ఇంటి కోసం వెతుకుతున్నవారిని టార్గెట్ చేస్తూ స్కామర్లు నకిలీ ప్రకటనలతో మోసం చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా లో ఓ బాధితుడు తన అనుభవాన్ని పంచుకున్నాడు. ప్రకటనలో అద్దె చాలా తక్కువగా ఉండటంతో అనుమానంతో ఉన్నప్పటికీ నంబర్‌కి కాల్ చేశాడు. కాల్ చేసిన వెంటనే ఓ వ్యక్తి ఓనర్ నంబర్ ఇస్తూ, ఇంటిని చూడాలంటే ముందుగా రూ.1,500 ఎంట్రీ ఫీజు చెల్లించాలని చెప్పాడట. డబ్బు చెల్లించిన తర్వాత మాత్రం ఆ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడు.

List of Bank Holidays in June 2025 : జూన్ నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసా..?

ఈ పోస్ట్‌కు అనేక మంది యూజర్లు తమ అనుభవాలను షేర్ చేశారు. లాన్కో హిల్స్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లో 1 బీహెచ్‌కే లభ్యం కాకపోయినా, నకిలీ ప్రకటనల ద్వారా డబ్బు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఎంట్రీ ఫీజు అడగడం, అపార్ట్‌మెంట్ అసలు ఉన్నదో లేదో తెలియకుండానే డబ్బులు తీసుకోవడం వంటి మోసాలపై వారు హెచ్చరించారు. ఇది స్కామ్ అని ముందుగానే గ్రహించినవారు తప్పించుకోగలిగారు. అయితే కొంతమంది మాత్రం డబ్బులు పోగొట్టుకుని మోసపోయారు.

ఇలాంటి మోసాలకు బలికాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మార్కెట్ ధర కంటే తక్కువ అద్దెకు ప్రకటనలు కనిపిస్తే అవి స్కామ్ అయి ఉండే అవకాశం ఉంది. ఇంటిని చూడటానికి ముందుగా ఎంట్రీ ఫీజు అడిగితే అలర్ట్ కావాలి. ఇంటి యజమాని వివరాలు, ప్రాపర్టీ స్థానికులతో లేదా అపార్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌తో నిర్ధారించుకోవాలి. ముఖ్యంగా సోషల్ మీడియా, నకిలీ వెబ్‌సైట్లలో ఇచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గేటెడ్ కమ్యూనిటీలలో 1 BHK ఫ్లాట్‌లు అందుబాటులో ఉండవు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Frauds
  • hyderabad
  • Rental Houses
  • To Let House

Related News

Nepali Gang Loots Gold In Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్‌

హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్‌కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడి

    Latest News

    • Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

    • Raghava Lawrence: రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ క్లారిటీ

    • Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

    • Tobacco: పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

    • Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దుపై జగ్గారెడ్డి ఫైర్

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd