Ralph Paul Yarl Case: పొరపాటున పక్కింటికి వెళ్లిన కుర్రాడు.. ఆ యజమాని ఏం చేశాడో తెలుసా?
ఇటీవల కాలంలో చాలామంది రెప్పపాటు కాలంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఊహించని
- By Anshu Published Date - 06:56 PM, Tue - 18 April 23

ఇటీవల కాలంలో చాలామంది రెప్పపాటు కాలంలో ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఊహించని నిర్ణయాల వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి. ఆవేశంగా తీసుకుని నిర్ణయాలు కట కటాల వెనక్కినడంతో పాటు కుటుంబాలను వీధిపాలు చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆఫ్రికన్ అమెరికన్ అయినా రాల్ఫ్ ఫాల్ గార్లు అనే పదహారేళ్ల కుర్రాడు తను 11 ఏళ్ల ట్విన్ బ్రదర్స్ ని స్నేహితుడి ఇంటి నుంచి పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు.
అపార్ట్మెంట్ కి చేరుకున్న తర్వాత ఆ కుర్రాడు పొరపాటున స్నేహితుడు ఇంటి డోర్ బెల్ మోగించకుండా పక్కింటి డోర్ బెల్ మోగించాడు. డోర్ కూడా రెండు మూడు సార్లు నాక్ చేశాడు. దాంతో ఆ ఇంటి యజమాని కోపంతో ఊగిపోయాడు. ఆ ఇంటి యజమాని అయిన ఆండ్రూ లెస్టర్ బోర్ వెంటనే కోపంగా డోర్ ఓపెన్ చేసి తుపాకీతో కాల్చేశాడు. నేరుగా ఆ బాలుడి తలలోకి రెండు తూటాలు దూసుకెళ్లాయి. దాంతో ఆ బాలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కాపాడండి రక్షించండి అని గట్టిగా కేకలు వేసి స్పృహ కోల్పోయాడు. అప్పుడు జేమ్స్ లింక్ అనే స్థానికుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆ కుర్రాడిని ఆస్పత్రికి తరలించాడు.
ఈ ఘటనపై స్థానిక వ్యక్తి లించ్ మాట్లాడుతూ డోర్ బెల్ మోగించినంత మాత్రాన కాల్పులు జరపడం అయినది కాదని, మొదట్లో తాను ఆ కుర్రాడు చనిపోయాడని అనుకున్నాను కానీ బతికే ఉన్నాడని తెలిసి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆ కుర్రాడి పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంది. కుర్రాడిపై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా గంటల వ్యవధిలోని విడుదల కావడంతో స్థానికులు కోపంతో కట్టలు తెచ్చుకుని నిరసనలు చేస్తున్నారు. నల్లజాతీ యువకుడి పై కాల్పులు జరిగితే అలా ఎలా వదిలేస్తాము అని తెలిపారు లించ్. ఈ ఘటనతో ఆఫ్రికన్ అమెరికన్ లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.