Venu Swamy : వేణుస్వామికి చేదు అనుభవం.. ఆలయం నుంచి గెంటివేత
Venu Swamy : సాధారణంగా వేణుస్వామి సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించడం చూస్తుంటాం. ఇప్పుడు ఆయనను ఆలయం నుంచి గెంటవేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
- By Sudheer Published Date - 01:00 PM, Thu - 21 August 25

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy)కి శక్తి పీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి ప్రవేశించకుండా అక్కడి సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. వేణుస్వామి సెలబ్రెటీలతో కలిసి తరచూ కామాఖ్య ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అయితే, ఆలయం గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారనే కారణంతో ఆలయ కమిటీ ఆయనను లోపలికి అనుమతించకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
Jaishankar : భారత్‌లో పెట్టుబడులు పెట్టండి.. రష్యాకు జైశంకర్ ప్రత్యేక ఆహ్వానం
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. ఆలయ సిబ్బంది వేణుస్వామిని ఆలయం లోపలికి రాకుండా గేటు వద్దే నిలువరించినట్లు సమాచారం. గతంలో వేణుస్వామి కామాఖ్య ఆలయం గురించి, అక్కడ జరిగే పూజల గురించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యల కారణంగానే ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై వేణుస్వామి ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
HYDRA : మాదాపూర్‌లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
సాధారణంగా వేణుస్వామి సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయించడం చూస్తుంటాం. ఇప్పుడు ఆయనను ఆలయం నుంచి గెంటవేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. వేణుస్వామి అనుచరులు, అభిమానులు ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. వేణుస్వామి స్పందన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కామాక్షి అమ్మవారి దేవాలయం నుండి వేణు స్వామిని తరిమేసిన అక్కడి అర్చకులు. #venuswamy #kamakhya #Temple #HashtagU pic.twitter.com/PnCCxviVbp
— Hashtag U (@HashtaguIn) August 21, 2025