Union Budget 2024-25 : బడ్జెట్ ఫై నెటిజన్ల ట్రోల్స్
ఉద్యోగ కల్పన అనేది మాటలకే పరిమితమా? ఉద్యోగులకు పన్నుల్లో ఇక ఊరట దక్కదా? అంటూ కన్నీరు పెడుతున్నట్లు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు
- By Sudheer Published Date - 04:55 PM, Tue - 23 July 24

దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్న బడ్జెట్ (Union Budget 2024-25) ను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టింది. రూ.48.21 లక్షల కోట్లతో సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.38లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.3శాతం ఉంటుందని అంచనా వేశారు. అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16లక్షల కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. మాములుగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారంటే సామాన్య ప్రజలు ఎక్కువగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా అలాగే ఎదురుచూసారు. అయితే ఈ బడ్జెట్ కూడా పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ లా లేదని వాపోతున్నారు.
యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ , దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ , మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బడ్జెట్, చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చే బడ్జెట్ ఇలా అన్ని విధాలా మేలు జరిగే బడ్జెట్ ను తీసుకొచ్చామని ప్రధాని మోడీ (PM Modi) అంటుంటే .. ఈ బడ్జెట్ కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్‌కు మేలు జరిగేలా ఉంది తప్ప ఎవరికీ పెద్దగా ఉపయోగపడేలా లేదని వాపోతున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే పెద్ద ఎత్తున ట్రోల్స్ , మీమ్స్ చేస్తూ ఫన్నీ గా రియాక్ట్ అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇవ్వకుండా ఎప్పటిలాగే కేంద్ర ప్రభుత్వం సొంత ప్రయోజనాల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టిందని నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు. ఇలాంటి బడ్జెట్ మహిళలకు ఆర్థిక స్వావలంబన ఎలా అని ఫన్నీగా ప్రశ్నిస్తున్నారు. ఈ దేశంలో చిరు వ్యాపారులు బతికేది ఎలాగని నిలదీస్తున్నారు. ఉద్యోగ కల్పన అనేది మాటలకే పరిమితమా? ఉద్యోగులకు పన్నుల్లో ఇక ఊరట దక్కదా? అంటూ కన్నీరు పెడుతున్నట్లు నెటిజన్లు మీమ్స్ సృష్టిస్తున్నారు. కేవలం ఏపీ , బీహార్ రాష్ట్రాలకు మేలు జరిగేలా బడ్జెట్ రూపొందించి ప్రవేశ పెట్టారని ..లేదంటే అక్కడి భాగస్వామ్య పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటే కుప్పకూలుతుందని భయపడి ఆ రాష్ట్రాలకు భారీగా నిధులు ఇచ్చారని ఫన్నీగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
Middle class on #Budget2024 pic.twitter.com/pe0O8xjY2W
— Mohd Sadan🇮🇳 (@im_sdn) July 23, 2024
This BUDGET is a complete failure with ZERO WARRANTY, presented by a FAILED FINANCE MINISTER OF A FAILED GOVERNMENT. Instead of tackling urgent issues like unemployment, rising prices and growing inflation, the BJP has crafted a budget to bribe its coalition partners and buy time…
— Abhishek Banerjee (@abhishekaitc) July 23, 2024
Honest taxpayer at the end of the day……!#Budget2024 pic.twitter.com/93Kt0jegpM
— Krishna (@Atheist_Krishna) July 23, 2024
Chandrababu Naidu coming out of the parliament after #Budget2024 pic.twitter.com/yIs3p4aCnK
— Krishna (@Atheist_Krishna) July 23, 2024
Read Also : ICC Women’s T20I,Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హర్మన్‌ప్రీత్-షఫాలీ దూకుడు