Chappal Chor: చెప్పును దొంగిలించిన పాము.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో!
ఓ పాము చెప్పును దొంగిలించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
- By Balu J Published Date - 04:00 PM, Sat - 26 August 23

Chappal Chor: సాధారణంగా పాములు బెడ్రూంలోనో, ఇంటిపైకప్పులోనో, కార్లు, బండ్లలోపల నక్కి భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. కానీ ఈ ఫొటోలో కనిపించే పాము చేసిన పనికి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. పామేంటి? ఇలా చేసేందేమిటి? అని షాక్ అవుతారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన నెటిజన్స్ నిజంగా షాక్ అయ్యారు.
ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన పాము ఒకటి తన విన్యాసాలతో చూపరులను ఆకట్టుకుంది. పాముకు ఏం చేయాలో తెలియక చెప్పుల వైపు వెళ్లింది. అయితే ఏమైందో చెప్పును నోటకర్చుకొని వేగంగా పెరుగెత్తుతూ కనిపించింది. ఈ విచిత్రమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వామ్మో పాములు కూడా చెప్పులను దొంగిలిస్తాయా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పట్నుంచి నా చెప్పులను జాగ్రత్తగా దాచుకోవాల్సిందే అంటూ రియాక్ట్ అవుతున్నారు.
Also Read: Asia Cup: ఆసియా కప్ పై కరోనా ఎఫెక్ట్, ఇద్దరు ఆటగాళ్లకు కోవిడ్ పాజిటివ్