Viral Video: క్యాట్ ట్రైన్.. వైరల్ వీడియో
సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మనసు పులకరిస్తుంది. అప్పటివరకు ఉన్న ఒత్తిడి మాయమవుతుంది.
- By Praveen Aluthuru Published Date - 06:09 PM, Sun - 20 August 23

Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మనసు పులకరిస్తుంది. అప్పటివరకు ఉన్న ఒత్తిడి మాయమవుతుంది. ముఖ్యంగా జంతువుల వీడియోలు మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. అవి చేసే అల్లరి, చిలిపి పనులు చూస్తుంటే కడుపుబ్బా నవ్వుకుంటాము. జంతువులకు సంబంధించి సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు కనిపిస్తాయి. తాజాగా ఓ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
The cat train.. 😂 pic.twitter.com/tIxcPixw7M
— Buitengebieden (@buitengebieden) August 20, 2023
కార్టూన్లతో తయారు చేసిన రైలులో పిల్లులు కూర్చున్నట్లు ఈ వీడియోలో చూడవచ్చు. ఈ రైలు కోచ్‌లను తాడుతో కట్టి దానిని ఒక వ్యక్తి లాగుతున్నారు. అదే సమయంలో ఇతర పిల్లులు రైలు డబ్బాలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ పెట్టెలో కూర్చున్న పిల్లులు వాటిని దగ్గరకు రానివ్వడం లేదు. ఈ వీడియోని ట్విట్టర్‌లో ‘బుటోంగిబిడాన్’ అనే వ్యక్తి పోస్ట్ చేశారు. దీంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి 1.2 మిలియన్లకు పైగా చూశారు. ఈ వీడియోను 12 వేల మందికి పైగా లైక్ చేసారు.
Also Read: 2024 US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు