UP Girl Suicide: ఆర్మీలో చేరాలనుకుంది, హైట్ లేకపోవడంతో ఆత్మహత్య
ఎత్తు తక్కువగా ఉండటంతో ఆర్మీ, పోలీసుల్లో ఉద్యోగం రావడం లేదని యువతీ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలోఈ ఘటన చోటు చేసుకుంది.
- By Praveen Aluthuru Published Date - 02:20 PM, Fri - 2 August 24

UP Girl Suicide: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎత్తు తక్కువగా ఉండడంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. ఎత్తు తక్కువగా ఉండడంతో ఆర్మీ, పోలీసుల్లో ఉద్యోగం రావడం లేదని చెబుతున్నారు స్థానికులు. దీంతో ఆమె డిప్రెషన్‌కు గురైంది. ఈ వ్యవహారం రెహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హరికిషన్‌పూర్‌లో చోటు చేసుకుంది.
తల్లిదండ్రులు ఇంట్లో లేరు:
21 ఏళ్ల అన్షిక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పుడు అన్షిక కుటుంబ సభ్యులు ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లారు. అయితే విద్యుత్ మీటర్ ఉద్యోగి ఇంటికి రావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడిన విషయం ఇరుగుపొరుగు వారికి తెలిసింది. దీంతో ఇరుగుపొరుగు వారు తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే కుటుంబీకులు పరుగు పరుగున ఇంటి వద్దకు వెళ్లి చూడగా అన్షిక ఉరివేసుకుని ఉండటంతో శోకసంద్రం నెలకొంది.
డిప్రెషన్‌లోకి అన్షిక:
ఘటనపై సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసులు విద్యార్థి తండ్రితో కూడా మాట్లాడారు. తన కూతురు ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలు అని బాలిక తండ్రి పోలీసులకు తెలిపాడు. ఆమె పోలీసు మరియు ఆర్మీలో చేరడానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఎత్తు తక్కువగా ఉండటం వలన ఎంపిక కాలేకపోతుంది అని ఆ తండ్రి వాంగ్మూలం ఇచ్చాడు. చాలా రోజులుగా డిప్రెషన్‌కు గురైన ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అన్షిక చదువులో చాలా ధీటుగా ఉండేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
Also Read: Tollywood : ‘నేను మీకు తెలుసా’ డైరెక్టర్ మృతి