Uttar Pradesh : రీల్స్ పిచ్చి..తెగిపోయిన తల..క్షణాల్లో విషాదం
Uttar Pradesh : గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోగా
- Author : Sudheer
Date : 20-10-2024 - 6:45 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రస్తుతం అంతా సోషల్ మీడియా ట్రెడ్ (Social Media Tread) నడుస్తోంది. దాదాపు అందరికి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు దర్శనం ఇస్తున్నాయి. అంతేకాక చాలా మందికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. ఇంకేముందు ఉదయం లేచిన దగ్గరి పడుకునే వరకు అంత సోషల్ మీడియా లో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టా రీల్స్ చూస్తూ, చేస్తూ సోషల్ మీడియా అనే సముద్రంలో మునిగిపోతున్నారు. ఇదే సమయంలో కొందరు ఫేమస్ అయ్యేందుకు రీల్స్, షాట్స్ చేస్తున్నారు. కొందరు ఫాలోవర్స్ పెంచుకోవాలని , ఫేమస్ కావాలనే ఉద్దేశ్యం..రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే అత్యాశతో రకరకాలుగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇప్పటీకే రీల్స్ చేస్తూ ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకోగా ..తాజాగా చూస్తుండగానే యువకుడి తలతెగిపోయింది.
ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) లోని ఆగ్రా లో జరిగింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. వీడియోలో ఐదుగురు యువకులు ఉన్నారు. ఇందులో ఒక ఇద్దరు నేలపై కూర్చొని వారి పని వారు చేసుకుంటున్నారు. మరొక యువకుడు షాప్ షెట్టర్ తెరవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక మరొక యువకుడు అక్కడే నిలబడి డాన్స్ చేస్తున్నట్లు కనిపించింది. మరొక యువకుడు రీల్స్ తీస్తున్నట్లుగానే వీడియో ద్వారా స్పష్టంగా కనబడుతుంది. స్లో మోషన్ లో ఒక యువకుడు పాటకు డాన్స్ చేస్తూ తన ఎదురుగా ఉన్న గ్యాలరీలో అమర్చిన ఐరన్ నెట్టును పైకి లేపే ప్రయత్నంలో అతడు బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో అదుపు తప్పి ఆ యువకుడు కింద పడిపోగా.. అతని తల శరీరం నుండి వేరు అయిపోయింది. తల నుంచి మొండం తెగి అమాంతంగా కింద పడిపోయినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు చూసిన తర్వాతైనా రీల్స్ పిచ్చి నుండి బయటపడాలని అంత కోరుకుంటున్నారు.
Reels बनाने वाले सावधान: आगरा में रील बना रहे युवक का सिर धड़ से अलग, देखें वीडियो, मचा हड़कंप pic.twitter.com/yMBcHIbKO7
— Raju Sharma (@RajuSha98211687) October 19, 2024
Read Also : Devi Sri Prasad : పాపం దేవిశ్రీ ప్రసాద్.. ఫస్ట్ కాన్సర్ట్ తోనే విమర్శలు..