HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Premiste Movie Sceen Repeat In Hyderabad

Hyderabad: హైదరాబాదులో ప్రేమిస్తే సినిమా సీన్ రిపీట్.. చివరికి?

ఇటీవల కాలంలో యువత ప్రేమ అనే మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ పరువును

  • Author : Anshu Date : 06-04-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

ఇటీవల కాలంలో యువత ప్రేమ అనే మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కుటుంబ పరువును తీయడంతో పాటు తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. కొందరు ప్రేమించిన యువతి కోసం ఆత్మహత్య చేసుకోవడం లేదంటే తనకు దక్కని యువతీ మరెవరికి దక్కకూడదని ఆమెను చంపేయడం లాంటివి చేస్తుంటారు. కాగా ఇంకొందరు ప్రేమించిన యువత కోసం గడ్డం పెంచుకోవడం ముందుకు బానిసలుగా మారడం పిచ్చివాళ్లుగా మారి రోడ్లపై తిరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి.

ఈ తరహా ఘటనలు ఇప్పటికీ ఎన్నో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా అటువంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక మతిస్థిమితం లేని వ్యక్తి హైదరాబాదులోని మీర్ పేట్ ప్రాంతంలో పెరిగిన జుట్టు,మాసిన గడ్డం చిరిగిన దుస్తులతో కనిపించాడు. అతన్నీ అటువంటి పరిస్థితులలో చూసిన స్థానికులు వెంటనే నాదర్‌గుల్‌లోని మాతృ దేవోభవ అనాథాశ్రమ నిర్వాహకుడికి సమాచారం అందించారు. స్థానిక సమాచారం మేరకు వెంటనే స్థలానికి చేరుకుని అతడిని ఆ ఆశ్రమ నిర్వాహకులు వారితో పాటు పిలుచుకొని వెళ్లారు.

ఆశ్రమ నిర్వాహకులు సపర్యలు చేసిన అనంతరం వివరాలు అడగగా.. తాను ప్రేమించిన యువతి వేరొకరిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తను అటువంటి పరిస్థితికి దీనస్థితికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. ప్రేమిస్తే సినిమాలో హీరో మాదిరిగా తయారైనట్లు ఆ యువకుడు తెలిపాడు.తన పేరు అర్జున్‌ అని, తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తే ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని, దాంతో మద్యానికి బానిసై రోడ్ల మీద తిరుగుతున్నట్లు అర్జున్ తెలిపాడు. అయితే ప్రస్తుతం అర్జున్‌ మానసిక స్థితి సరిగాలేదని మాతృదేవోభవ ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. కొద్ది రోజుల తర్వాత ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స చేయించి మామూలు మనిషిగా మార్చడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. అయితే అర్జున్‌ ని ఎవరైనా గుర్తుపడితే 9347513830 ఫోన్‌ నెంబర్‌‌లో సంప్రదించాలని అనాథాశ్రమ నిర్వాహకుడు గిరి కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arjun
  • hyderabad
  • Love failure
  • premiste movie

Related News

Good news for burger lovers: Burger Singh restaurant opens in Hyderabad.

Burger Singh: బర్గర్ ప్రియులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో బర్గర్ సింగ్ రెస్టారెంట్ ప్రారంభం

Burger Singh : భారతదేశపు అతిపెద్ద స్వదేశీ బర్గర్ బ్రాండ్ ‘బర్గర్ సింగ్’ (Burger Singh) మళ్లీ హైదరాబాద్ మార్కెట్లోకి అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగుపెట్టింది. కోవిడ్ మహమ్మారి కంటే ముందు నగరంలో విజయవంతంగా నడిచిన ఈ బ్రాండ్.. తాత్కాలిక విరామం తర్వాత ఇప్పుడు మరింత పటిష్టమైన విస్తరణ ప్రణాళికలతో రీ-ఎంట్రీ ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి ఫ్రాంచైజీ-ఆధారిత రెస్టారెంట్ వృద్ధి వేదికను నిర్మించ

  • Drug scare in Hyderabad: MLC's son arrested while attempting to purchase drugs.

    Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్‌

  • Controversy over 'Kalma' homework at a private school in Hyderabad; teacher wrote in the diary instructing students to read the Quran.

    హైదరాబాద్ ప్రైవేట్ స్కూల్‌లో కల్మా’ హోంవర్క్ వివాదం.. ఖురాన్ చదవాలంటూ డైరీలో రాసిన టీచర్

  • Groundwater levels falling in Telangana... Is a water crisis inevitable this summer?

    Water Scarcity: తెలంగాణలో పడిపోతున్న భూగర్భజలాలు.. ఈ వేసవిలో నీటి ఎద్దడి తప్పదా..?

Latest News

  • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

  • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

  • Poonam Pandey: నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పూనమ్ పాండే

  • Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు ముంచెత్తడంతో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd