PM Modi: పండ్లు అమ్ముకునే మహిళ చేసిన పనికి మోడీ ఫిదా
కర్ణాటకలో పండ్లు అమ్ముకునే మహిళతో దేశ ప్రధాని ముచ్చటించడం వైరల్ గా మారింది. ప్రధాని మోదీ భేటీ నేడు కర్ణాటకలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలతో మామేకం అయ్యారు.
- Author : Praveen Aluthuru
Date : 29-04-2024 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
PM Modi: కర్ణాటకలో పండ్లు అమ్ముకునే మహిళతో దేశ ప్రధాని ముచ్చటించడం వైరల్ గా మారింది. ప్రధాని మోదీ భేటీ నేడు కర్ణాటకలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పలు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలతో మామేకం అయ్యారు. ఈ క్రమంలో మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఈ పర్యటనాలో భాగంగా మోడీ ఓ మహిళతో మాట్లాడారు. ఆమె చేస్తున్న సమాజ సేవకి మోడీ ప్రశంసించారు.
కర్ణాటకలోని అంకోలా బస్టాండ్ సమీపంలో ఓ మహిళ పండ్లను విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుంది. అయితే అందరిలా కాకుండా స్వచ్ఛ భారత్ నినాదాన్ని పాటిస్తుంది అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. పండ్ల వ్యాపారి మోహిని గౌడ్ ప్రతి రోజు ఆ బస్టాండ్ సమీపంలో పండ్లు విక్రయిస్తున్నారు. ఆమె ప్రత్యేకత ఏమిటంటే ఎవరైనా ఆమె వద్ద పండ్లను కొనుగోలు చేస్తే.. అక్కర్లేని దాన్ని అక్కడే పడేస్తుంటారు. అయితే ఆమె పండ్లు విక్రయించే ప్రదేశంలో దాదాపు కిలోమీటరు మేర చెత్తను సేకరించి ఆమె స్వయంగా వాటిని ఎత్తుకుని డస్ట్‌బిన్‌లో పడవేస్తుంది. మోహిని చేస్తున్న ఈ మంచి పనికి అందరూ ఫిదా అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కాగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని సిర్సీ పర్యటన సందర్భంగా అంకోలాకు చెందిన పండ్ల విక్రయదారు మోహిని గౌడను కలిశారు. కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని సిర్సీలో బహిరంగ ర్యాలీకి హాజరయ్యేందుకు ముందు హెలిప్యాడ్‌కు చేరుకున్న ప్రధాని, తొలుత మోహినీ గౌడను కలిశారు. సమావేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో మోడీ మోహినిని కలుసుకుని, ఆమెను ప్రశంసిస్తున్నారు.
Also Read: Kenya : తెగిన డ్యామ్..42 మంది మృతి..భారీగా జనం గల్లంతు