Snake Robot : చంద్రుడు, అంగారకుడిపైకి స్నేక్ రోబో.. మనోడి క్రియేటివిటీ
Snake Robot : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’లో ఎంతోమంది భారతీయులు, ఇండో-అమెరికన్లు సైంటిస్టులుగా ఉన్నారు.
- By Pasha Published Date - 06:55 PM, Wed - 15 November 23

Snake Robot : అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’లో ఎంతోమంది భారతీయులు, ఇండో-అమెరికన్లు సైంటిస్టులుగా ఉన్నారు. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాల్లో నాసా వరల్డ్ నంబర్ 1. చంద్రుడు, అంగారకుడిపైకి పంపేందుకు పామును పోలిన ఒక రోబోను నాసా ఇటీవల తయారు చేసింది. ప్రస్తుతం దాన్ని పరీక్షిస్తోంది. కొండ చిలువ ఆకారంలో ఉన్న ఈ రోబో భవిష్యత్తులో లూనార్, మార్స్ ఉపరితలాలపై అన్వేషణ కోసం వెళ్లనుంది. ఈ స్నేక్ రోబో తయారీ కోసం పనిచేసిన టీమ్‌లో కీలక పాత్రలో భారతీయ శాస్త్రవేత్త రోహన్ థక్కర్ ఉన్నారు. ఆయన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
నాగ్‌పూర్‌లో చదువుకున్న రోహన్ థక్కర్ ఇప్పుడు నాసాలోని జెట్ ప్రొపల్షన్ లాబోరేటరీలో పనిచేస్తున్నాడు. ఈయన నాగ్‌పూర్‌లోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (VNIT) లో మెకానికల్ ఇంజినీరింగ్ చేశారు. నాసా కోసం అంగారకుడిపై పనిచేయగల హెలికాప్టర్‌ను రూపొందించిన ఐఐటీ విద్యార్థి బాబ్ బలరామ్ నుంచి ప్రేరణ పొంది తాను కూడా నాసాలో చేరానని రోహన్ చెప్పారు. ‘‘నేను బ్యాడ్ స్టూడెంట్. ఐఐటీలో చేరడంలో విఫలం అయ్యాను. కానీ నాసాలో మాత్రం చేరాను’’ అని తెలిపారు.పాము ఆకారంలో ఉన్న రోబోను తయారుచేసిన నాసా టీమ్‌లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రోబోకు ఎక్సోబయాలజీ ఎక్స్‌టాంట్ లైఫ్ సర్వేయర్(ఈఈఎల్ఎస్) అని పేరు పెట్టారు.ఇది చాలా తెలివైనదని, కఠినమైన భూభాగాల్లో కూడా పాకగలదు. నీటి అడుగులో కూడా ఈత కొట్టగలదు. మార్స్ భూభాగంతో పాటు హిమనీనదాలపైనా ఇది యాక్టివిటీ చేయగలదు. ఒకచోటు నుంచి మరో చోటుకు ప్రయాణించగలదు. విపత్తుల సమయంలో, రెస్క్యూ, సెర్చ్ ఆపరేషన్లలోనూ ఇది పనికి(Snake Robot) వస్తుంది.