Top States – Top Donors : దేశ ప్రజల దానగుణంపై ఆసక్తికర నివేదిక
Top States - Top Donors : ఇతరులకు సాయం చేసే గుణం భారతీయుల్లో ఎక్కువే.
- By Pasha Published Date - 06:28 PM, Wed - 15 November 23

Top States – Top Donors : ఇతరులకు సాయం చేసే గుణం భారతీయుల్లో ఎక్కువే. మన దేశంలోని ప్రజల సహాయం చేసే స్వభావంపై, తాజాగా విరాళాలు అందిస్తున్న తీరుతెన్నులపై క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ‘కెట్టో’ ఇటీవల సర్వే నిర్వహించింది. ఆ వివరాలతో విడుదల చేసిన తాజా నివేదికలో ఆసక్తికర అంశాలను పొందుపరిచింది. అవేంటో ఒకసారి చూద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
- ఈ సంవత్సరం 4.19 లక్షల మంది భారతీయులు తొలిసారిగా ఆన్‌లైన్‌లో విరాళాలను అందించారు. వారిలో ఎక్కువ మంది సగటున రూ. 500 విరాళంగా అందించారు.
- ఈ ఏడాది అతిపెద్ద విరాళం కర్ణాటకలోని మైసూర్ నుంచి రూ. 25 లక్షలు వచ్చింది.
- వారంలోని ఇతర రోజులతో పోలిస్తే శుక్రవారాల్లో ప్రజలు ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారు.
- హైదరాబాద్‌కు చెందిన ఓ దాత గత ఏడాది 941 సార్లు కెట్టోకు విరాళాలు అందించారు.
- కెట్టోకు దాతల ద్వారా అందుతున్న విరాళాల సగటు మొత్తం రూ. 1120.
- జంతు సంక్షేమ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వడంలో ముంబై ముందంజలో ఉంది.
- పాజిటివ్ థింకింగ్ ప్రోగ్రామ్స్ కు తిరువనంతపురం మద్దతుగా ఉంటోంది.
- ఢిల్లీ వాసులు విద్య కంటే ఆహార సంబంధిత కార్యక్రమాలకే ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారు.
- UPI, వాలెట్, కార్డ్, బ్యాంక్ బదిలీల ద్వారానే ఎక్కువగా విరాళాలు ఇస్తున్నారు.
- కెట్టోతో ఈ ఏడాది దాతలు విరాళాలకు సంబంధించిన 13 లక్షల లావాదేవీలు చేశారు. 190,187 మంది దాతలు ఈ విరాళాల లావాదేవీలను(Top States – Top Donors) నిర్వహించారు.