Monalisa : అప్పుడే రిబ్బన్ కటింగ్ లు మొదలుపెట్టిన మోనాలిసా..అదృష్టం అంటే ఈమెదే..!!
Monalisa : సోషల్ మీడియా లో కాస్త క్రేజ్ వస్తే చాలు సినిమాల్లో నటించకపోయిన..ఆమెతో షాప్ ఓపెనింగ్స్ చేయిస్తూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నా
- By Sudheer Published Date - 12:26 PM, Sat - 15 February 25

సాధారణంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చకనో…లేదా బ్లాక్ బస్టర్ మూవీ తన ఖాతాలో వేసుకున్నకో సదరు హీరోయిన్ల చేత తమ షాప్ ఓపెనింగ్ లు చేయించడం..లేదా తమ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకోవడంలో చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆలా కాదు కాస్త క్రేజ్ వస్తే చాలు సినిమాల్లో నటించకపోయిన..ఆమెతో షాప్ ఓపెనింగ్స్ చేయిస్తూ వార్తల్లో నిలిచేలా చేస్తున్నారు పలు సంస్థల యజమానులు. తాజాగా మోనాలిసా (Monalisa ) తో కూడా అలాగే షాప్ ఓపెనింగ్ చేయించి వార్తల్లో నిలిచేలా చేసారు. సోషల్ మీడియా క్రేజ్ అంటే ఏంటో మరోసారి మోనాలిసా ద్వారా యావత్ ప్రపంచానికి తెలిసింది. మహాకుంభమేళాలో వైరల్ అయిన ఈమె.. ఇప్పుడు కేరళలో జువెల్లరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ వేడుకలో మెరిసిపోయింది. మోనాలిసా రాక తెలియగానే వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. సాధారణంగా ఒక సామాన్య వ్యక్తి ఒక్కసారిగా ప్రజాదరణ పొందడం అరుదుగా కనిపించే విషయం. కానీ సోషల్ మీడియా ద్వారా ఇది సాధ్యమవుతోంది.
Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఎవరు ?
వైరల్ ఫోటోలు, వీడియోలు ఎంతటి మార్పును తెచ్చిపెడతాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది. మహాకుంభమేళాలో ఒక చిన్న వీడియో ద్వారా పాపులర్ అయిన ఈమె.. ఇప్పుడు ప్రత్యేకంగా మేకప్, స్టైల్ మార్చుకొని కొత్త లుక్‌లో దర్శనమిచ్చింది. ఆమె అందం, చలాకీతనం తో పాటు అభిమానులకు అందించిన గౌరవం అందరినీ ఆకట్టుకుంది. జువెల్లరీ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొనడం ద్వారా తన క్రేజ్ ఏ స్థాయికి పెరిగిందో అర్థమయ్యింది. ఈమెను చూసేందుకు యువత ఎగబడ్డారు. అంతే కాదు, ఆమె అభిమానులకు అభివాదం చేస్తూ, కొన్ని స్టెప్పులేస్తూ అలరించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడే ఈమె క్రేజ్ ఇలా ఉంటె ఫస్ట్ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెంత ఉంటుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.
ప్రస్తుతం మోనాలిసా..బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా తెరకెక్కిస్తున్న “ది డైరీ ఆఫ్ మణిపూర్” సినిమాలో నటిస్తోంది. మణిపూర్‌కు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కుమార్తె పాత్రను పోషించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సినిమాలో మోనాలిసా పాత్ర చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలనే కోరికతో ఉన్న యువతి. ఆమె ఎదుర్కొన్న కష్టాలు మరియు చివరికి సైన్యంలో చేరిన కథనం ఈ సినిమాలో చూడవచ్చు.
വയറൽ സുന്ദരി മൊണാലിസക്ക് ഒപ്പം കോഴിക്കോടിന്റെ മണ്ണിൽ ആടി തിമർത്ത് ബോച്ചേ🔥 #monalisa #boche #letest pic.twitter.com/VLW2aRzc4T
— B4blaze (@B4blazeX) February 14, 2025