Child Marriage: మహబూబ్‌నగర్‌లో 6వ తరగతి బాలికకు పెళ్లి
6వ తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. బీరప్ప జూన్‌లో మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక స్కూల్‌లోని ఉపాధ్యాయురాలు పెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
- Author : Praveen Aluthuru
Date : 05-07-2024 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
Child Marriage: టెక్నాలజీ పెరుగుతుంది. మనుషుల్లో మార్పులు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లి మహిళలు పని చేయడం మొదలు పెట్టారు. కానీ సాంప్రదాయాల విషయంలో ఇంకా వెనకబడే ఉన్నాం. 100 ఏళ్ళ క్రితం జరిగిన ఘటనలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 6వ తరగతి చదువుతున్న బాలికకు పెళ్లి చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆరవ తరగతి అంటే సదరు బాలిక వయసు మహా అయితే 11 సంవత్సరాలు ఉంటుంది. ఆ వయసులో పెళ్లి చేయడం అంటే ఆ బాలిక జీవితం నాశనం చేయడమే.
మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో ఓ గ్రామానికి చెందిన 6వ తరగతి చదువుతున్న బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదైంది. బీరప్ప జూన్‌లో మైనర్ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలిక స్కూల్‌లోని ఉపాధ్యాయురాలు పెళ్లి విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అధికారులు వెంటనే బాలికను స్టేట్ హోంకు తరలించి, వివాహానికి పాల్పడిన యువకుడిపై, బాలిక కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.
Also Read: Hyderabad: పార్థీ గ్యాంగ్‌పై పోలీసులు కాల్పులు