Malla Reddy : మనవరాలి పెళ్లిలో డాన్స్ ఇరగదీసిన మల్లారెడ్డి
Malla Reddy : మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని… కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారు
- By Sudheer Published Date - 01:31 PM, Mon - 21 October 24

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. కేవలం సభలు , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా లోను ఈయనకంటూ ఓ ప్రత్యేక అభిమానులు ఉంటారు. నిత్యం ఈయన చేసే కామెంట్స్ , వేసే స్టెప్స్ ఆయన్ను వైరల్ చేస్తూ అందరి చేత నవ్వులు తెల్లపిస్తుంటాయి. ప్రస్తుతం ఆయన తన మనవరాలి పెళ్లి (Mallareddy Granddaughter’s wedding) సందడి లో ఉన్నాడు.
మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి (Malkajgiri MLA Rajasekhar Reddy) కూతురు వివాహం ఈనెల 27న జరగనుంది. ఈ క్రమంలో పెళ్లి వేడుకకు ముందు జరిగే కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఆదివారం రాత్రి సంగీత్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రి జరిగిన సంగీత్ కార్యక్రమంలో మల్లారెడ్డి స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చారు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని… కొరియోగ్రాఫర్లతో కలిసి స్టెప్పులు వేశారు. ఇందుకోసం మాజీ మంత్రి మల్లారెడ్డి గత వారం రోజులుగా కొరియోగ్రాఫర్ల దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. గతంలోనూ మల్లారెడ్డి అనేకసార్లు డాన్స్ చేసిన.. ఇది మాత్రం సినిమా స్టైల్‌లో వెరైటీగా కనిపిస్తుంది. సంగీత్ ఫంక్షన్లు కచ్చితంగా ఆయన డాన్స్ చేయాల్సిందే బంధువులంతా పట్టుబట్టడంతో… “డీజే టిల్లు“ సినిమా పాటకు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం మల్లారెడ్డి డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియో నెటింట్లో చక్కర్లు కొడుతుంది.
మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు సంగీత్ ఫంక్షన్ లో డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్పులు వేసిన మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది! #mallareddy#viralvideo #DanceVideo #HashtagU pic.twitter.com/MT6tk1tlps
— Hashtag U (@HashtaguIn) October 21, 2024
Read Also : Allu Arjun: ఏపీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్