Leopard In House : 15 గంటలు ఇంట్లోనే చిరుత.. ఆ తర్వాత ఏమైందంటే ?
Leopard In House : ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత దాదాపు 15 గంటల పాటు అక్కడే ఉండిపోయింది.
- By Pasha Published Date - 03:19 PM, Mon - 13 November 23
Leopard In House : ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత దాదాపు 15 గంటల పాటు అక్కడే ఉండిపోయింది. ఈక్రమంలో చిరుత కదలికలను సైలెంట్‌గా షూట్ చేస్తున్న జర్నలిస్టు సహా అక్కడున్న ఆరుగురిపై ఎటాక్ చేసింది. దీంతో ఆరుగురికి తల, చేతులు, గొంతుపై గాయాలయ్యాయి. ఈ ఘటన తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూర్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిరుతపులిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ కూనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
#WATCH | Tamil Nadu: A leopard entered a house in the Coonoor's Brooklands area, in Nilgiri. pic.twitter.com/bPbh7tW91F
— ANI (@ANI) November 13, 2023
కూనూర్ ఏజెన్సీ ప్రాంతంలో చిరుతపులుల సంచారం ఇదే మొదటిసారి కాదు. ఆహారం, నీటిని వెతుక్కుంటూ జంతువులు నివాస ప్రాంతాల్లోకి రావడం ఇక్కడ కామన్. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతేడాది ఆగస్టులో నీలగిరి జిల్లా మైనలైలో చిరుతపులి నాలుగేళ్ల చిన్నారిపై దాడి (Leopard In House) చేసి చంపింది.