Delhi Metro: మెట్రో ట్రైన్ లో సీట్ కోసం కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్?
మామూలుగా ట్రైన్ లు బస్సులలో ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సీట్ల కోసం గొడవపడడం అన్నది కామన్. ఎక్కువగా ఇలా ట్రైన్ లో సీటు కోసం కోట్లాడుకోవడ
- Author : Anshu
Date : 27-08-2023 - 3:27 IST
Published By : Hashtagu Telugu Desk
మామూలుగా ట్రైన్ లు బస్సులలో ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సీట్ల కోసం గొడవపడడం అన్నది కామన్. ఎక్కువగా ఇలా ట్రైన్ లో సీటు కోసం కోట్లాడుకోవడం కొన్ని కొన్ని సార్లు కొట్టుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కాగా ఇప్పటికే ఎన్నో సందర్భాలలో మహిళలు సీట్ల కోసం జుట్లు జుట్లు పట్టుకొని కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే మెట్రో ట్రైన్లు ఇద్దరూ మహిళలు కొట్టుకున్నారు.
అయితే, ఈ సారి మెట్రో కాదు. DTC కి చెందిన ఒక బస్సులో మహిళలకు సంబందించిన ఫైట్ ఇది. ఇద్దరు మహిళా ప్రయాణీకుల మధ్య జరిగిన సిగపట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Kalesh b/w Two Woman inside Delhi Government Bus over Seat issues pic.twitter.com/M1CWkaU5Xx
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2023
కాగా ఆ వీడియోలో బస్సులో అందరు చూస్తుండగా ఆ మహిళలు ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. పక్కనే ఉన్న కొందరు ఆపడానికి ప్రయత్నించినా కూడా ఆ మహిళలు వారిని పట్టించుకోకుండా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తున్నారు. కాగా ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. ఆ వీడియోలో కూడా ఆ మహిళలు కొట్టుకుంటుండగా పక్కనే ఉన్న కొందరు వ్యక్తులు నవ్వుతున్నారు. ఒక వ్యక్తి వచ్చి వారిని అడ్డుపడడానికి ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తిని వాళ్ళు పట్టించుకోకుండా అలాగే జుట్లు పట్టుకొని కొట్టుకోవడం అన్నది అందరికి నవ్వులు తెప్పిస్తోంది.