Viral : కుమారి ఆంటీపై DJ సాంగ్..ఎవ్వరు తగ్గట్లే కదా..!!
- By Sudheer Published Date - 01:23 PM, Sat - 3 February 24
కుమారి ఆంటీ (Kumari Aunty) విషయంలో ఎవ్వరు తగ్గట్లే.. ప్రస్తుతం అంత సోషల్ మీడియా ట్రేండింగ్..లేచినదగ్గరి నుండి పడుకునేవరకు అంత సోషల్ మీడియా లోనే గడిపేస్తున్నారు. చూసుకోవడం , మాట్లాడుకోవడం , సలహాలు ఇవ్వడం, సలహాలు తీసుకోవడం, వంటలు , ఆరోగ్య సూత్రాలు , బిజినెస్ ఐడియా లు ఇలా ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరు సోషల్ మీడియా స్టార్లు అవుతున్నారు. ఒక్కప్పుడు సినిమా తారలకు మాత్రమే అభిమానులు ఉండేవారు..కానీ ఇప్పుడు సోషల్ మీడియా స్టార్లకు అభిమానులుగా మారుతున్నారు.
రీసెంట్ గా సోషల్ మీడియా లో కుమారి ఆంటీ టాప్ ట్రేండింగ్ లో కొనసాగుతుంది. కుమారీ ఆంటీ (Kumari Aunty)..కుమారీ ఆంటీ..ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కుమారీ ఆంటీనే దర్శనం ఇస్తుంది. అంతలా ఆమెను వైరల్ చేసారు యూట్యూబర్స్ .. హైదరాబాద్ లోని దుర్గం చెరువు సమీపంలోని ఫుట్ స్ట్రీట్ (Street Food) లో కుమారి ఆంటీ మధ్యాహ్నం పూట వెజ్, నాన్ వెజ్ మీల్స్ విక్రయిస్తూ ఉంటుంది. ఈమె ఇటీవల ఒక వీడియోతో నెట్టింట బాగా ఫేమస్ అయ్యింది. నాన్న మీది రూ.థౌజెండ్ అయ్యింది.. 2 లివర్లు ఎక్స్ ట్రా అంటూ చెప్పిన వీడియో పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. సినీ స్టార్స్ సైతం ఈమె ఫుడ్ తినేందుకు పోటీ పడడంతో ఇంకేముందు యూట్యూబర్లంతా ఈమె దగ్గరికి వాలిపోయారు..మెను కార్డు నుండి ప్రతిదీ కవర్ చేస్తూ వైరల్ చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వీడియోస్ చుసినా జనాలంతా ఈమె దగ్గరికి వాలిపోయారు. ఈమె దగ్గర ఫుడ్ తినానాలంటే కనీసం గంటకు పైగా వెయిట్ చేయాల్సదే..అంటే అర్ధం చేసుకోవాలి..ఈమె దగ్గరికి ఎంతమంది వస్తున్నారో..ఈమె దగ్గర జనాలు చూసి స్టార్ హోటల్స్ సైతం ఆశ్చర్యపోవడం మొదలుపెట్టారు. ఫలితంగా.. రద్దీ ఎక్కువైపోయి, రోడ్డుపైనే వాహనాలు పార్క్ చేస్తుండంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుందని ట్రాఫిక్ పోలీసులు హోటల్ ను క్లోజ్ చేసారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో జోక్యము చేసుకొని , కుమారి హోటల్ వైపు ట్రాఫిక్ పోలీసులు వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేయడం తో మళ్లీ ఓపెన్ అయ్యింది. ఈ రకంగా కూడా కుమారి ఆంటీ మరింత వైరల్ గా మారారు. ఇక ఇప్పుడు కుమారి ఆంటీ పేరుతో DJ సాంగ్ చేసి మరింత పాపులర్ ను చేసారు.
ఇప్పటికే కుమారి ఆంటీ కి సంబదించిన మీమ్స్ , రీళ్లు, వీడియోలు వైరల్ అవుతుండగా..ఇప్పుడు DJ సాంగ్ కూడా ఆ జాబితాలో చేరింది. నెల్లూరుకు చెందిన హరీష్ కుమారి ఆంటీ మాటలు తీసుకుని డీజే సాంగ్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు సెకన్ల వ్యవధిలోనే భారీ వ్యూస్ వచ్చాయి. దీనికి దాదాపు 5.67 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయంటే ఎంతగా కుమారి ఆంటీ ఫేమస్ అయ్యిందో చుడండి. మీరు కూడా ఈ DJ సాంగ్ ఫై లుక్ వెయ్యండి.
DJ Mix aaa 🙄 🤦🏻#KumariAunty pic.twitter.com/RhIxRxUm1Z
— Rajesh Manne (@rajeshmanne1) February 2, 2024
Read Also : Raviteja Eagle : ఈగల్ ను ఎవరు పట్టించుకోవడం లేదా..?
Related News
AP Politics : గుడివాడలో కుమారి ఆంటీ ప్రచారం.. పిఠాపురంలో నిర్మాత ఎస్కెఎన్..
రీసెంట్ సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ కూడా ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చేసారు. కుమారి ఆంటీ స్వస్థలం గుడివాడ అని అందరికి తెలిసిందే.