Japan-Bound Flight : విమానంలో అడల్ట్ మూవీ.. సిగ్గుతో తలదించుకున్న ప్రయాణికులు
Japan-Bound Flight : ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు వెళ్తున్న క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ విమానంలోని స్క్రీన్లలో 'అడల్ట్ కంటెంట్' ప్రసారం కావడం తో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు
- By Sudheer Published Date - 05:15 PM, Mon - 7 October 24

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి జపాన్లోని హనెడాకు వెళుతున్న క్వాంటస్ విమానం (Qantas flight QF59)లోని అన్ని స్క్రీన్లలో ఒక్కసారిగా అడల్ట్ మూవీ ప్లే అయ్యింది. అంతే అది చూసి ప్రయాణికులు సిగ్గుతో తలదించుకున్నారు. అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక కారణాలతో (Technical Glitch) ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్ లలోనే కాదు తిరుమల క్షేత్రంలో కూడా అలాంటి ఘటనలు జరిగాయి. తిరుమల క్షత్రంలో జరిగినప్పుడు పెద్ద వివాదం చెలరేగింది.
తాజాగా ఇప్పుడు విమానంలో జరిగింది. ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు వెళ్తున్న క్వాంటాస్ ఎయిర్‌లైన్స్ విమానంలోని స్క్రీన్లలో ‘అడల్ట్ కంటెంట్’ ప్రసారం కావడం తో ప్రయాణికుల్లో కొందరు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాటిని ఆఫ్ చేయలేక..ఏంచేయాలో తెలియక తలదించుకున్నారు. విమానంలో అలాంటి వీడియో ప్లే కావడం చూసి తాను షాక్ అయ్యానని, అభ్యంతరకర ను మార్చడానికి తమకు సుమారు గంట సమయం పట్టిందని ఒక ప్రయాణీకుడు పేర్కొన్నాడు. సాంకేతిక లోపం కారణంగానే అలా జరిగిందని విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌లో సాంకేతిక లోపం వల్లే ఈ ఘటన జరిగిందని వివరిస్తూ క్వాంటాస్ ఈ ఘటనను ధృవీకరించింది. వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై విచారిస్తున్నట్లు క్వాంటాస్ ప్రతినిధి తెలిపారు.
Read Also : Matrimonial Ad : వరుడి వెరైటీ యాడ్ వైరల్.. ఆదాయం, ప్రొఫెషన్ గురించి ఏం చెప్పాడంటే..