Sunita Williams : సునీతా విలియమ్స్ కు పెద్ద కష్టమే రాబోతోందా..?
జూన్ 14న వారు భూమికి రావాల్సి ఉండగా.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది
- Author : Sudheer
Date : 05-08-2024 - 2:50 IST
Published By : Hashtagu Telugu Desk
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్‌మోర్ (Butch Wilmore) ల ఆరోగ్యం ఫై ఇప్పుడు అంత అరా తీస్తున్నారు. జూన్ 5 న భూకక్ష్యకు 400 కిలోమీటర్లు ఎత్తున ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌక వారిని విజయవంతంగా తీసుకెళ్లింది. జూన్ 14న వారు భూమికి రావాల్సి ఉండగా.. బోయింగ్ స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యతో వారు భూమిపైకి రావడం వాయిదాపడుతూ వస్తున్నది. స్పేస్‌క్రాఫ్ట్‌లోని థ్రస్టర్, హీలియం వ్యవస్థలు సరిగ్గా పనిచేయక పోవడం వల్ల వారు రాలేకపోతున్నారు. యుద్ధ ప్రతిపదికన భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా కృషి తీవ్రంగా కస్టపడుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దంపతులకు కొన్ని శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. స్పేస్ లో గుర్వతాకర్షణ బలం సున్నాగా ఉండటంతో వారు బరువు తగ్గి కండరాలు,ఎముకల పై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంటుంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : Jammu and Kashmir : జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం