Reynolds Retiring : ప్రియమైన రెనాల్డ్స్ పెన్నులు.. ఇకపై కనిపించవా ?
Reynolds Retiring : రెనాల్డ్స్ పెన్.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనదేశంలో 1990వ దశకంలో అది ఎంతగా జనాలకు రీచ్ అయిందో అందరికీ తెలుసు.
- By Pasha Published Date - 04:16 PM, Fri - 25 August 23

Reynolds Retiring : రెనాల్డ్స్ పెన్.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మనదేశంలో 1990వ దశకంలో అది ఎంతగా జనాలకు రీచ్ అయిందో అందరికీ తెలుసు.
ఆ సమయంలో చదువుకున్న వారంతా ఏదో ఒక దశలో రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ ను వాడారు.
రెనాల్డ్స్ పెన్ రీఫిల్ లో ఇంక్ అయిపోతే.. ఇంకో రీఫిల్ కొనేవారు. పెన్ విరిగితే మళ్లీ అలాంటి పెన్నే కొనేవారు.
అయితే ఇప్పుడేం జరిగింది ?
Also read : Operation Kammam : తుమ్మలకు మూడు పార్టీల ఆఫర్ ! తేల్చుకోవడానికి ఆత్మీయ ర్యాలీ!!
రెనాల్డ్స్ కంపెనీ పెన్నుల ఉత్పత్తి ఇక జరగదంటూ తాజాగా కొందరు సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేశారు. దీంతో పలువురు నెటిజన్స్ బరువెక్కిన మనసుతో పోస్టులు పెట్టారు. తమకు ఆ పెన్నుతో ఉన్న అటాచ్ మెంట్ ను గుర్తు చేసుకున్నారు. లాస్ట్ బ్యాచ్ కావడంతో ఆ పెన్నును కొని గుర్తుగా పెట్టుకోవాలని కొందరు పోస్ట్ పెట్టారు. రెనాల్డ్స్ పెన్నుల్లో 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్ పెన్నులు చాలా ఫేమస్ ఇంకొందరు సలహాలు ఇచ్చారు. లేజర్ టిప్స్ ఉండే 045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్ పెన్నులు మంచివని, వాటిలో ఇంక్ లీక్ కాదని మరికొందరు చెప్పారు. ఈనేపథ్యంలో రెనాల్డ్స్ కంపెనీ స్పందించింది. తమ కంపెనీ పెన్నుల ఉత్పత్తిని ఆపడం లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం అబద్ధమని తేల్చి చెప్పింది. భారతదేశంలో తమకు 45 సంవత్సరాల చరిత్ర ఉందని, క్వాలిటీకి, కొత్తదనానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని రెనాల్డ్స్ పేర్కొంది. భారతదేశంలో ఇంకా తమకు బలమైన ప్లాన్లు ఉన్నాయని, మరింత నాణ్యమైన పెన్నులను తీసుకొస్తామని వెల్లడించింది. రెనాల్డ్స్ పెన్నులకు సంబంధించిన అసలు సమాచారం కోసం కంపెనీ వెబ్ సైట్ లేదా సోషల్ మీడియా హ్యాండిల్స్ ను (Reynolds Retiring) చూడొచ్చని సూచించింది.