Boys Hostel: బాయ్స్ హాస్టల్ లో మహిళ వర్కర్ అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్
ప్రైవేట్ హాస్టల్స్ ఇష్టారాజ్యంగా డబ్బులను వసూలు చేస్తుంటాయి. అంతేకాదు.. భోజనం, ఇతర వసతులను కూడా
- Author : Balu J
Date : 12-05-2023 - 12:45 IST
Published By : Hashtagu Telugu Desk
చాలామంది ఉద్యోగం (Jobs) కోసమో, చదువుల కోసమో పట్టణాల్లో, సిటీల్లో ఉంటుంటారు. అలాంటివాళ్లంతా హాస్టల్స్ లో ఉండేందుకు ఇష్టం చూపుతుంటారు. ఇదే అదనుగా భావించే ప్రైవేట్ హాస్టల్స్ (Hostel) ఇష్టారాజ్యంగా డబ్బులను వసూలు చేస్తుంటాయి. అంతేకాదు.. భోజనం, ఇతర వసతులను కూడా అంతంత మాత్రమే సమకూరుస్తుంటారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కారణం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
ఓ ప్రైవేట్ బాయ్స్ (Boys) హాస్టల్లో పనిచేసే మహిళ అసభ్యకరంగా ప్రవర్తించడం చర్చనీయాంశమవుతోంది. వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేస్తోంది. ఇదంతా కొద్దిరోజులుగా జరుగుతుండగా భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా బయట పడింది. దీంతో మహిళను పనినుండి తొలగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read: Maoist Couriers: మావోలపై పోలీస్ నిఘా.. నలుగురు కోరియర్స్ అరెస్ట్!