Viral : నేనే శివయ్యను..నేను చెప్పినట్లు చెయ్యండి
Viral : అశోక్ తన వాక్కులో తాను పరమ శివుడినని, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని చెప్పుకొచ్చాడు
- By Sudheer Published Date - 06:09 PM, Tue - 5 November 24

మూడ నమ్మకాలకు పల్లెలని, పట్నాలని తేడాలేదు. కాక పోతే పల్లెల్లో కాస్త ఎక్కువగా నమ్ముతుంటారు. మూడ నమ్మకాలలో ప్రధానంగా వినిపించేది..కనిపించేది మనిషికి దెయ్యం పట్టడం, వంటి మీదకు దేవుడు రావడం, దెయ్యాలు, భూతాలు, మిత్తవలు, గాలి శోకడం వంటివవి ఎక్కువగా వినిపిస్తుంటాయి. స్త్రీలాకు మాత్రమే దెయ్యం పట్టేది. దానికి మంత్రగాన్ని పిలిపించి ముగ్గులు వేసి, నిమ్మకాయలు కోసి వేప మండలతో చావ బాదుతారు. ఈ తతంగం అంతా చాల కౄరంగా ఉంటుంది. మాంత్రికుడు వేప మండలతో కొడుతూ….. దిగతావా దిగవా …. అని అరుస్తూండగా ఆస్త్రీ దిగుతా…. దిగుతా….. అని కొంత సేపటికి స్వాదీనంలోకి వస్తుంది. ఆతర్వాత ఆమెకు తగిలిన దెబ్బలకు వైద్యం చేస్తుంటారు. ఇక ఒంటి మీదకు దేవుడు పూనడం… లేకా పూనకం రావడం . కొందరికి పూనకం దానంతట అదే వస్తుంది. కొందరికి పూనకాన్ని ప్రేరేపించి తెప్పిస్తారు. పూనకం వచ్చాక ఆ వ్యక్తి మారు గొంతుతో ….. వూగుతూ ఎదేదో అంటుంటాడు. అప్పుడు పక్కనున్న వారు వారికి కావలసిన ప్రశ్నలు సందించి జవాబులు రాబట్టు కుంటారు. ఆంతా అయ్యాక దేవుడు కొండెక్కీ పోతాడు . అప్పుడా వ్వక్తి మామూలు స్థితికి వచ్చి ‘దేవుడు ఏమి చెప్పాడ’ ని ఎదుటి వారినే అడిగి తెలుసుకుంటాడు. తాజాగా ఇప్పుడు భద్రాచలంలో అదే జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన అశోక్ అనే బాలుడు మంగళవారం ఉన్నట్లుండి ఒక్కసారిగా పూనకంతో ఊగిపోయాడు. ఎప్పుడూ లేనివిధంగా అశోక్ పూనకంతో ఊగుతుండగా, కుటుంబ సభ్యులు, గ్రామస్తులంతా ఆ బాలుడు ఏమి చెబుతాడోనంటూ గుమికూడారు. ఇక అశోక్ తన వాక్కులో తాను పరమ శివుడినని, తాను చెప్పిన ప్రదేశంలో ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కార్తీక మాసం కావడం.. పరమ శివయ్యకు ప్రీతికరమైన మాసం కావడం తో బాలుడు చెప్పేది నిజమే కావొచ్చు అని గ్రామస్తులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో, భారీగా బాలుడి వాక్కు వినేందుకు కమలాపురం చేరుకుంటున్నారు. అయితే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు, మీడియా వారు కూడా గ్రామానికి చేరుకొని వివరాలు తెలుసుకునే పనిలోపడ్డారు. బాలుడు చెబుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలోకి వస్తుండగా, శివుడి విగ్రహాలు బయటపడితే గుడి కట్టిస్తామని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారట. ఇంతకు బాలుడు చెప్పినట్లుగా ఆ ప్రాంతంలో నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయా లేదా అన్నది ఆరడుగుల గొయ్యి తవ్వితే గానీ తెలియని పరిస్థితి. మరి ఏంజరుగుతుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం గామస్తులు , ఫారెస్ట్ అధికారులు ఎంచేయాలా అనే ఆలోచనలో పడ్డారు.
నేనే పరమ శివుడిని అంటూ 15 ఏళ్ల బాలుడు హల్‌చల్
ఆరడుగుల గొయ్యి తవ్వితే నందీశ్వరుడు, శివుడి విగ్రహాలు బయటపడతాయని అంటున్న అశోక్ అనే బాలుడు
శివుడి విగ్రహాలు బయటపడితే గుడి కట్టిస్తామని, లేదంటే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలన్న ఫారెస్ట్ అధికారులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… pic.twitter.com/2BXuGB5ju2
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2024
Read Also : AP Mega DSC Notification: రేపే ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల..