Bali : నగ్నంగా దేవాలయంలోకి వెళ్లిన భక్తుడు…
ఆలయంలోకి ఓ వ్యక్తి నగ్నంగా ప్రవేశించి.. ధ్యానం చేయడం కలకలం రేపింది. నగ్నంగా ఆ వ్యక్తి ధ్యానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
- Author : Sudheer
Date : 06-10-2023 - 1:09 IST
Published By : Hashtagu Telugu Desk
దేవాలయాలకు (Hindu Temples) వెళ్ళేటప్పుడు ఎవరైనా చాల పద్దతిగా..మంచి బట్టలు వేసుకొని..భక్తి శ్రద్దలతో వెళ్తుంటారు. కానీ ఇక్కడో భక్తుడు మాత్రం నగ్నంగా వెళ్లడమే కాదు ఆలయం లోపల నగ్నంగా ధ్యానం చేసి భక్తుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అయిన ఇండోనేషియాలోని బాలి (Bali)లో చోటుచేసుకుంది.
We’re now on WhatsApp. Click to Join.
ప్రతిరోజు బాలిలోని ఆలయానికి హిందువులతో పాటు ఆయా దేశాల పర్యాటకులు వందల సంఖ్యలో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలే ఆ ఆలయంలోకి ఓ వ్యక్తి నగ్నంగా ప్రవేశించి.. ధ్యానం చేయడం కలకలం రేపింది. నగ్నంగా ఆ వ్యక్తి ధ్యానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో భక్తులు ఆ టూరిస్ట్‌పై మండిపడుతున్నారు. హిందూ ఆలయంలో నగ్నంగా ధ్యానం చేసిన వ్యక్తిని గుర్తించాలని, అతనికి శిక్ష వేయాలని కోరడం తో..అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కానీ అతను ఏ దేశస్తుడు అనే విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. గతంలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. రష్యాకు చెందిన లూయిజా కోసిఖ్ అనే 40 ఏళ్ల మహిళ బాలిలోని 700 ఏళ్ల నాటి మర్రి చెట్టు ముందు నగ్నంగా ఫోటో తీయించుకున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అప్పట్లో ఆమెను బాలి నుంచి బహిష్కరించడమే కాకుండా అరెస్ట్ చేసి శిక్ష వేశారు. మరి ఇప్పుడు ఈ వ్యక్తిని ఏంచేస్తారనేది చూడాలి.
Read Also : Social Media: సోషల్ మీడియా పోస్టులపై అరెస్టులు, శిక్షలు ఉండవు
https://www.instagram.com/p/Cx0WwzPyyfx/