Mlc Seats : తెలంగాణలో 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం
వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
- By Latha Suma Published Date - 06:38 PM, Thu - 13 March 25

Mlc Seats : తెలంగాణలో జరగనున్న 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు స్థానాలకు 5 నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు అధికారిక ప్రకటన జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, బీఆర్‌ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం ఎన్నికయ్యారు. వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్ అధికారి వాటిని తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. దీంతో ఐదుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
Read Also:Tamil Nadu : రూపాయి సింబల్‌ను మార్చేసిన తమిళనాడు సర్కారు
అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఆధారంగా కాంగ్రెస్ కు 4 స్థానాలు రాగా.. వాటిలో ఒకటి పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించింది. ఫలితంగా కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ లు.. సీపీఐ నుంచి సత్యం నామినేషన్ వేశారు. బీఆర్ఎస్ కు ఒక స్థానం రాగా.. ఆ పార్టీ నుంచి దాసోజు శ్రావణ నామినేషన్ దాఖలు చేశారు. కాగా వీరంతా ఏకగ్రీవం అయినట్టు ఈసీ ప్రకటించింది.
కాగా, తెలంగాణలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను నిలపింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్ ఇచ్చింది. మరో సీటును సీపీఐకి కేటాయించగా.. ఆ పార్టీ నెల్లికంటి సత్యంను బరిలోకి దించింది. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణకు గుడువు ముగియడంతో అధికారులు వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అసెంబ్లీలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: Ola Electric Holi Flash Sale: హోలీ సందర్భంగా ఓలా ఫ్లాష్ సేల్.. రూ. 26,750 తగ్గింపు!