Ghost In Assembly: అసెంబ్లీలో దెయ్యం, వణికిపోతున్న ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యే అమృత్‌లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో 'దెయ్యం' ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచాయి. అమృతలాల్ మీనా మృతికి విధానసభ వాస్తు లోపమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 09:26 AM, Mon - 12 August 24

Ghost In Assembly: రాజస్థాన్ అసెంబ్లీ మరోసారి వార్తల్లో నిలిచింది. కారణం ఏంటంటే రాజస్థాన్ అసెంబ్లీలో మొత్తం 200 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ కలిసి కూర్చోలేకపోవడమే. ఎవరో ఒకరు చనిపోవడమో లేదా జైలుకు వెళ్లడమో జరుగుతుంటుంది. ఆగస్టు 8న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అమృతలాల్ మీనా గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు ఆయన మరణంపై ఆశ్చర్యకరమైన వాదనలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అసెంబ్లీలో ‘దెయ్యం’ ఉంది అంటూ కొందరు ఎమ్మెల్యేలు భయాందోళనకు గురవుతున్నారు.
సాలంబర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమృత్‌లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో ‘దెయ్యం’ ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచాయి. అమృతలాల్ మీనా మృతికి విధానసభ వాస్తు లోపమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అదే సమయంలో ఎమ్మెల్యేల ఆరోగ్యం, ప్రాణాలతో చెలగాటమాడుతున్న అసెంబ్లీలో వాస్తు దోషం ఉందని జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు కూడా చెబుతున్నారు.
కొన్నేళ్ల క్రితం కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హవన పూజ చేయాలని, గంగాజలంతో శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపాలను తొలగించేందుకు పూజలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ శాసనసభ నిర్మించిన స్థలంలో అంతకుముందు శ్మశానవాటిక ఉండేదని, దాని కారణంగా భవనం వాస్తు దోషాలను కలిగి ఉందని మరియు ప్రతికూల శక్తులతో ప్రభావితమైందని, దాని ప్రభావం అవాంఛనీయ సంఘటనలను సృష్టిస్తున్నదని కొంత మంది ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.
రాజస్థాన్‌లో ఏ ఎమ్మెల్యే చనిపోయినా అసెంబ్లీలో దయ్యాలు ఉన్నాయని పదే పదే తలెత్తే మొదటి సమస్య. ఎమ్మెల్యే అమృత్‌లాల్ మీనా మృతితో ఈ వ్యవహారం హాట్ హాట్‌గా మారింది. 2002 నుంచి రాష్ట్రంలో 16 మంది ఎమ్మెల్యేలు చనిపోయారు. రాష్ట్రంలో ఎప్పుడు, ఏ ఎమ్మెల్యే మరణించారో తెలుసుకుందాం:
- అమాగర్ (పశ్చిమ) స్థానం నుండి ఎమ్మెల్యే అయిన కిషన్ మోత్వాని ఫిబ్రవరి 2002లో మరణించారు.
- బన్సూర్ ఎమ్మెల్యే జగత్ సింగ్ దయామా డిసెంబర్ 2002లో మరణించారు.
- గెహ్లాట్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సగ్వారా ఎమ్మెల్యే భిఖా భాయ్ 2002లోనే మరణించారు.
- అదే ఏడాది లుంకరన్‌సర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భీంసేన్ చౌదరి కన్నుమూశారు.
- లుని నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి రాంసింగ్ బిష్ణోయ్ 2004లో కన్నుమూశారు.
- బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ సింగ్ 2005లో మరణించారు.
- దుంగార్‌పూర్ ఎమ్మెల్యే నాథూరామ్ అహరి డిసెంబర్ 2006లో మరణించారు.
- మండల్‌ఘర్ ఎమ్మెల్యే కీర్తి కుమారి ఆగస్టు 2017లో మరణించారు.
- నాథద్వారా నుండి బిజెపి ఎమ్మెల్యే కళ్యాణ్ సింగ్ ఫిబ్రవరి 2018 లో మరణించారు.
- కాంగ్రెస్ ఎమ్మెల్యే సహదా కైలాష్ త్రివేది 6 అక్టోబర్ 2020న మరణించారు.
- 16 నవంబర్ 2020న మంత్రి మాస్టర్ భన్వర్‌లాల్ దీర్ఘకాలిక అనారోగ్యంతో మరణించారు.
- రాజ్‌సమంద్‌లోని బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి 30 నవంబర్ 2020న కరోనాతో మరణించారు.
- వల్లభనగర్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ శక్తావత్ 20 జనవరి 2021న మరణించారు.
- 19 మే 2021న ధరియావద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గౌతమ్ లాల్ మీనా కోటోనాలో మరణించారు.
- సర్దార్‌షహర్‌లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ 6 అక్టోబర్ 2022న మరణించారు.
- ఇప్పుడు ఆగస్టు 2024లో సాలంబర్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అమృత్ లాల్ మీనా గుండెపోటుతో మరణిస్తారు.
Also Read: Band Aid For Heart : గుండెకు బ్యాండ్ ఎయిడ్.. రెడీ చేసిన శాస్త్రవేత్తలు