Delhi: గ్యాంగ్ స్టార్ టిల్లు హత్య కేసులో కీలక విషయాలు.. శరీరంపై 90 కత్తిపోట్లు?
తాజాగా ఢిల్లీలోని తిహాడ్ జైల్లో గ్యాంగ్ స్టార్ టిల్లు తాజ్ పురియా దారుణమైన హత్యకు గురైన విషయం తెలిసిందే.. మే 2వ తేదీన టిల్లు దారుణ హత్యకు గుర
- By Anshu Published Date - 08:00 PM, Fri - 5 May 23

తాజాగా ఢిల్లీలోని తిహాడ్ జైల్లో గ్యాంగ్ స్టార్ టిల్లు తాజ్ పురియా దారుణమైన హత్యకు గురైన విషయం తెలిసిందే.. మే 2వ తేదీన టిల్లు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిహాడ్ జైల్లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో హై రిస్క్ వార్డ్‌లో ఉన్న టిల్లు అలియాస్ సునిల్ మాన్‌పై తోటి ఖైదీలు, మరో గ్యాంగ్‌స్టర్ గోగి గ్యాంగ్ సభ్యులు దాడి చేసి చంపేశారు. టిల్లు తాజ్‌పురియా డిల్లీలోని అత్యంత క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్‌కు హెడ్. 2015లో ఓ కేసులో అరెస్టయి అప్పటి నుంచి తిహాడ్ జైల్లో ఉన్నాడు. టిల్లు గ్యాంగ్‌కు దిల్లీకి చెందిన మరో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగితో ఏళ్ల తరబడి శత్రుత్వం ఉంది.
ఆ శత్రుత్వమే చివరికి టిల్లు ప్రాణాలు తీసింది..కాగా ఈ హత్య కేసులో భాగంగా ఒకదాని తర్వాత ఒకటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే గ్యాంగ్ స్టార్ టిల్లుని ప్రత్యర్థులు ఒకటి రెండు కాదు దాదాపు 90 సార్లు దారుణంగా పొడిచి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యింది. అతడి శరీరంపై మొత్తంగా 100 వరకు గాయాలున్నట్లు తెలిసింది. అంతేకాకుండా రక్తపు మడుగులో ఉన్న అతడిపై పోలీసుల ఎదుటే ప్రత్యర్థి గ్యాంగ్ పదే పదే దాడి చేసినట్లు సీసీటీవీలో కూడా కనిపించింది. కాగా కదా ఈ హత్యకు సంబంధించిన కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ వీడియోలో టిల్లుని ప్రత్యర్థులు ఇనుపరాడ్లతో అతి దారుణంగా పొడిచారు. తీవ్ర గాయాల పాలైన అతడిని నలుగురు పోలీసులు మరో గదికి మోసుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే నిందితులు మరొకసారి టిల్లు పై అతి దారుణంగా దాడికి దిగారు. కాళ్ళతో తంతు అతనిపై దాడికి దిగారు. అయితే అదృశ్యం అంతా కూడా పోలీసుల కళ్ళు ఎదుటే జరిగింది. అదంతా కూడా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. తిహాడ్ జైల్లో జైలు అధికారులు, సిబ్బంది ప్రవర్తన, ఖైదీల భద్రతపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.