Gill Fan Girl Proposal: గిల్ .. ఐ లవ్ యూ అంటూ లేడీ ఫ్యాన్ రచ్చ
టీమిండియా యువకిరణం శుబ్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సకాలంగా గిల్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. 2023 సంవత్సరంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
- Author : Praveen Aluthuru
Date : 29-09-2023 - 5:56 IST
Published By : Hashtagu Telugu Desk
Gill Fan Girl Proposal: టీమిండియా యువ కిరీటం శుబ్ మన్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సకాలంగా గిల్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉంది. 2023 సంవత్సరంలో గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఈ ఏడాదిలో గిల్ 7 అద్భుత శతకాలు బాదాడు. అదేవిధంగా ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
ఈ మధ్య గిల్ ఫార్మేట్ తో సంబంధం లేకుండా ఆడుతున్నాడు. టీ20, టెస్టు, వన్డే మూడు ఫార్మెట్లలోనూ బ్యాట్ ఝళిపిస్తునాడు. ఈ ఏడాది ఆడిన అన్ని మ్యాచుల్లోనూ గిల్ విశ్వరూపం చూపించాడు. తాజాగా ఆస్ట్రేలియాపై భారీ శతకాన్ని బాది ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మనోడికి ఆటకి అమ్మాయిలు ఫిదా అవుతున్నారు. గర్ల్స్ లో మనోడికి తెగ ఫాలోయింగ్ పెరుగుతుంది.
గిల్ సచిన్ కుమార్తె సారాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ గాసిప్స్ ని సారా మరియు గిల్ ఒక్కసారి కూడా ఖండించలేదు. దీంతో వాళ్ళిద్దరి మధ్య నిజంగానే లవ్ ట్రాక్ రన్ అవుతున్నట్టు కన్ఫర్మ్ చేస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి గిల్ ఐ లవ్ యూ అంటూ తన మనసులోని మాటని బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు. ఇంగ్లాండ్ తో జరిగే వామప్ మ్యాచ్ కోసం నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తుండగా.. ఓ లేడీ ఫ్యాన్ గిల్ ఐ లవ్ యూ అంటూ రచ్చ చేసింది. గ్రౌండ్ లో ఉన్న గిల్ ను చూస్తూ.. ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తోంది. ఇది గమనించిన గిల్ ఆమెకు చెయ్ ఊపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: BJP Internal Fight : మోడీతో తాడోపేడో! బీజేపీ అసమ్మతి వ్యూహం!!