BJP Internal Fight : మోడీతో తాడోపేడో! బీజేపీ అసమ్మతి వ్యూహం!!
BJP Internal Fight : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ వస్తున్నారు. ఆ రోజున తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్లు భావిస్తున్నారట.
- By CS Rao Published Date - 05:31 PM, Fri - 29 September 23

BJP Internal Fight : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ ఒకటో తేదీన మహబూబ్ నగర్ వస్తున్నారు. ఆ రోజున తాడోపేడో తేల్చుకోవాలని బీజేపీలోని సీనియర్లు భావిస్తున్నారట. ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించుకుంటోన్న అసంతృప్తివాదులు బీజేపీ నుంచి బయటపడేందుకు సిద్ధమవుతున్నారని టాక్. ఆ జాబితాలో కొండా విశ్వేశ్వరరెడ్డి, వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, ఏనుగు రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి కీలక లీడర్లు వెళ్లిపోగా, మిగిలిన గెలుచే నేతలు కూడా పక్క చూపులు చూస్తున్నారని తెలుస్తోంది. దానికి కారణం అధిష్టానం నిర్వాకం కారణంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం మీద కసితీర్చుకోవడానికి బీజేపీ కండువా (BJP Internal Fight)
`చింత చచ్చినా పులుపు చావదన్నట్టు..` బీజేపీ పూర్తిగా తెలంగాణాలో బలహీనపడిందని (BJP Internal Fight) తాజా సర్వేల సారాంశం. కనీసం 10శాతం ఓటు బ్యాంకు కూడా లేదని సర్వత్రా వినిపిస్తోంది. ఒకరిద్దరు మినహా గెలిచే అవకాశం లేదని టాక్. ఏడాది క్రితం అధికారానికి దగ్గరలో ఉన్నట్టు కనిపించిన ఆ పార్టీ ఒక్కసారిగా దిగజారింది. తెలంగాణ సమాజం ఆ పార్టీని విశ్వాసంలోకి తీసుకోవడంలేదు. ఆ విషయాన్ని గమనించిన అసంతృప్తివాదులు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గూటికి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీనియర్లకు అధిష్టానం నుంచి సరైన సమాధానం రాలేదు. తెలంగాణ ప్రభుత్వం మీద కసితీర్చుకోవడానికి బీజేపీ కండువా కప్పుకుఉన్న వాళ్లకు నిరాశ మిగిలింది.
సోమశీల మీద తీగల వంతెన శంఖుస్థాపన
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ బీజేపీ ఊదరగొట్టొంది. ఆ క్రమంలో మహబూబ్ నగర్ ప్రచారం కూడా జరగనుంది. ఇప్పటికే రైల్వే డబుల్ ట్రాక్స్, జాతీయ హైవేలు భారీగా తెలంగాణకు వచ్చాయి. అవన్నీ కేంద్రం ఇచ్చినవే. అక్టోబర్ ఒకటో తేదీన సోమశీల మీద తీగల వంతెన శంఖుస్థాపన జరుగుతోంది. ఆ వంతెన పూర్తియితే, హైదరాబాద్, తిరుపతి మధ్య దూరం 80 కిలోమీటర్లు తగ్గుతుంది. కేవలం 500 కిలోమీటర్ల దూరం మాత్రమే హైదరాబాద్-తిరుపతి మధ్య ఉంటుంది. దీనితో పాటు ఆ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి కనీసం 1లక్షా 50వేల మంది జనాన్ని తరలించడానికి బీజేపీ రంగం సిద్ధం చేసింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను మాజీ ఎంపీ జితేంద్రరెడ్డి తీసుకున్నారు.
Also Read : BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!
అసమ్మతి మీద జితేంద్రరెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. ఇటీవల ఒక ట్వీట్ చేస్తూ ఒక దున్నపోతును తన్నుతూ ఆటోలో ఎక్కించే ఫోటోను పెట్టారు. దానిపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. అంటే, అసమ్మతివాదులను కట్టడీ చేయాలని అధిష్టానంకు సూచిస్తూ ఆ ట్వీట్ చేసినట్టు అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో జరుగుతోన్న సభ సందర్భంగా అసమ్మతి వాదులను మోడీతో కలిపే ప్రయత్నం చేయడానికి ఛాన్స్ తక్కువ. ఇటీవల హైదరాబాద్ వచ్చిన అమిత్ షా కేవలం ఈటెల రాజేంద్ర, కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో మాత్రమే భేటీ అయ్యారు. ఫలితంగా మిగిలిన లీడర్లు అసహనంగా ఉన్నారు. అంతర్గతంగా బీజేపీలోని సీనియర్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే రహస్యంగా పలు చోట్ల మీటింగ్ లు పెట్టుకున్నారు. ఢిల్లీకి వెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని అనుకున్నారు. కానీ, మోడీ రాష్ట్రానికి వస్తున్నందున స్థానికంగా తేల్చుకోవాలని చూస్తున్నారు.
Also Read : Eelection in April : KCR కు అంతుబట్టని BJP స్కెచ్!