Drunk Teacher: మద్యం మత్తులో ఉపాధ్యాయుడు.. బయటకు లాక్కెళ్లిన పేరెంట్స్
మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
- By Praveen Aluthuru Published Date - 03:17 PM, Fri - 28 June 24

Drunk Teacher: తెలంగాణలో ఓ ఉపాధ్యాయుడు మద్యం మత్తులో రచ్చ చేశాడు. కాల్వ సుధాకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న ఘటనతో విద్యార్థులు భయబ్రాంతులకు గురయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఉపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో మాట్లాడి తీవ్ర ఆందోళనకు గురి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ఇల్లందులపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది.
ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాల్వ సుధాకర్ ప్రవర్తనపై విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఎం చేయాలో తెలియక కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు సదరు పాఠశాలకు వచ్చి సుధాకర్‌ను తరగతి గదిలో బంధించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కాగా విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యాదమ్మ అతనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంది.
గత కొంతకాలంగా ఆ ఉపాధ్యాయుడి చేస్తున్న కీచక పనులను విద్యార్థులు యాదమ్మకు చెప్పారు. కాగా ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని యాదమ్మ విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయుడిని తరగతి గది నుంచి విడుదల చేశారు.
Also Read: Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్