Snakes Village : మన దేశంలో పాముల గ్రామం అనే ఓ గ్రామం ఉందని మీకు తెలుసా..?
Snakes Village : దేశం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు ఈ గ్రామాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పాముల సంరక్షణకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు
- By Sudheer Published Date - 01:56 PM, Sat - 26 April 25

మనదేశంలో అనేక ప్రత్యేకతలు గల గ్రామాలు ఉన్నాయి. వాటిలో మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో ఉన్న షెట్ఫాల్ (Shetphal) గ్రామం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రామాన్ని “పాముల గ్రామం” (Snakes Village)గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంట్లో నాగుపాములు సహజంగానే నివసిస్తాయి. గ్రామస్తులు ఈ పాములను కుక్కలు, పిల్లుల్లా గౌరవించి పెంచుకుంటారు. పొలాల్లో, చెట్లపై, ఇళ్లలో, మరికొన్ని సార్లు బెడ్‌రూముల్లో కూడా పాములు కనిపించడం ఇక్కడ సాధారణ విషయమే. స్థానికులు పాములతో భయభ్రాంతుల్లేకుండా అనురాగభావంతో జీవించడమే వారి జీవిత విధానం.
AAA : పుష్పరాజ్ పక్కన హాట్ బ్యూటీ..అబ్బా ఇది కాంబో అంటే !!
షెట్ఫాల్ గ్రామ ప్రజలు పాములను శివుని ప్రతీకలుగా భావించి పూజిస్తారు. వారి భక్తి వల్లే పాములను తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. ఇది తరతరాలుగా వస్తుంది. బాల్యములోనే పిల్లలు పాములను ఎలా పట్టుకోవాలి, సంరక్షించాలో నేర్చుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇక్కడ పాము కాటుకు సంబంధించిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. గ్రామస్తుల నమ్మకం ప్రకారం, ప్రేమ, గౌరవం చూపిస్తే పాములు కూడా మానవులను హానిచేయవు. ఈ నమ్మకంతో వారు పాములతో సహజీవనం చేస్తున్నారు.
ఇప్పటికే షెట్ఫాల్ గ్రామం పర్యాటక ఆకర్షణగా మారింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన సందర్శకులు ఈ గ్రామాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. పాముల సంరక్షణకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ప్రభుత్వం ఈ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది.