AAA : పుష్పరాజ్ పక్కన హాట్ బ్యూటీ..అబ్బా ఇది కాంబో అంటే !!
AAA : ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎంపిక అయ్యిందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది
- By Sudheer Published Date - 01:42 PM, Sat - 26 April 25

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప తో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న అల్లు అర్జున్ (Allu Arjun), ఇప్పుడు మరొక పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ‘పుష్ప 2’ సినిమా ద్వారా 1850 కోట్లకుపైగా వసూళ్లతో రికార్డులను తిరగరాసి, తన మార్కును చూపించాడు. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నటించనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఎంపిక అయ్యిందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అట్లీ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బాండెడ్ స్క్రిప్ట్ రెడీ చేయగా, ఇందులో మృణాల్ పాత్రకు ప్రాధాన్యత ఉండబోతుందట.
AP Debts : కూటమి సర్కారుపై విషం కక్కిన బుగ్గన.. అప్పులపై అబద్ధాలు
మృణాల్ ఠాకూర్ గతంలో ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆమె నటన, అందం, గ్లామర్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో పక్కన నటించబోతుండటం, ఆమె కెరీర్‌కు మైలురాయిగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ చూసి ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం దక్కడం ఆమెను ఇండియాలోనే టాప్ హీరోయిన్ల లిస్ట్‌లోకి చేర్చే అవకాశం ఉందని చెప్పడం అతి శయోక్తి కాదు.
Pakistan PM: ఉగ్రదాడి.. భారత్‌ను బెదిరించిన పాక్ ప్రధాని!
ఒకదశలో గ్లామర్ రోల్స్ చేసేది కాదని చెప్పిన మృణాల్, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఇకపై పాత్రల పరంగా ఏమైనా చేస్తానని ఓపెన్‌గా పేర్కొంది. అందులో భాగంగా ఆమె ఈ సినిమాలో గ్లామర్ షో చేసే అవకాశాలు లేకపోలేదు. అయినా ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో, ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే.