Wayanad Landslides : జై జవాన్ అంటూ బాలుడు లేఖ..
'డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది.
- By Sudheer Published Date - 03:03 PM, Sun - 4 August 24

కేరళలోని వయనాడ్‌లో విపత్తు సృషించిన బీభత్సం అంత ఇంతాకాదు…వందలమంది ప్రాణాలు తీయగా..వేలకోట్ల ఆస్థి నష్టం వాటిల్లింది. ఈ విపత్తు నుండి కోలుకునేందుకు వయనాడ్ కు చాల టైం పడుతుంది. ఇక ఈ విపత్తులో ఇండియన్ ఆర్మీ (The Indian Army) తమ ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడుతుంది. ప్రాణాలను పణంగా పెట్టి దేశం కోసం పోరాడుతున్నారు. అంతే కాదు ఎలాంటి విపత్తులు వచ్చిన ప్రజలను కాపాడుతుంటారు. వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటన దేశ వ్యాప్తంగా విషాదానికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 290కి పైగా ప్రజలు మరణించారు. ప్రకృతి సృష్టించిన బీభత్సంలో రోడ్లు, ఇళ్లు కానరాకుండాపోయాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంట్లలోనే రంగంలోకి దిగిన ఇండియన్ ఆర్మీ బాధితులను కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది. ఓ వైపు మృతదేహాలను వెలికితీయడంతో పాటు మరో వైపు సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, అటవీ శాఖ టీమ్స్ మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. వీరి పని నిబద్దతను చూసి వయనాడ్‌కు చెందిన ఓ మూడో తరగతి విద్యార్థి, ఆర్మీకి ధన్యవాదాలు తెలుపుతూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖకు ఆర్మీ కూడా స్పందిచింది. దీనితో ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
‘ప్రియమైన ఇండియన్ ఆర్మీ, నా జన్మస్థలం వయనాడ్‌లో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టించింది. శిథిలాల కింద చిక్కుకున్న ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడటం చూశాను. ఆహారం లేకపోయినా బిస్కెట్లు తింటూ సరిపెట్టుకుంటున్నారు. బాధితులను కాపాడడానికి వంతెనలు నిర్మిస్తున్నారు. ప్రజల ప్రాణాల కోసం మీరు శ్రమిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉంది. నేను కూడా ఏదో ఒక రోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను’ అని ఆ బాలుడు రాసుకొచ్చాడు.
బాలుని లేఖను అందుకున్న ఆర్మీ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణ వల్ల, దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందని పేర్కొంటూ, బాలుడి లేఖను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘డియర్ రాయన్ నువ్వు హృదయపూర్వకంగా రాసిన మాటలు మమ్మల్ని భావోద్వేగానికి గురి చేశాయి. దేశ ప్రజలకు ఎటువంటి ఆపద వచ్చినా వారికి తోడుగా ఉండాలనేదే మా లక్ష్యం. మీ లేఖ మా లక్ష్యాన్ని పునరుద్ఘాటిస్తోంది. ఇటువంటి వారు ఇచ్చే ప్రేరణతో మేము మరింత ఉత్సాహంగా పని చేస్తాం. నువ్వు ఆర్మీ యూనిఫామ్ ధరించి, మాతో కలిసి నిలబడే రోజు కోసం ఎదురు చూస్తుంటాం. అప్పుడు దేశ ప్రజల కోసం కలిసి పోరాడదాం. నీ ధైర్యానికి, స్ఫూర్తికి ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు.
The letter from a young boy, Rayan from Kerala and Indian Army’s reply to him.There can be no better compliment and acknowledgement for the selfless service of the Indian Army. 🇹🇯 pic.twitter.com/UAqq1EoVT9
— Kavi 🇮🇳 (@kavita_tewari) August 3, 2024
Read Also : Sravana Masam 2024: శ్రావణమాసంలో పొరపాటున కూడా వీటిని శివుడికి అసలు సమర్పించకూడదని తెలుసా?