Rajasthan: దళిత బాలుడి చేత మూత్రం తాగించిన పోకిరీలు
దళితులపై అమానుష ఘటనలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఏ మాత్రం భయపడటం లేదు. పైగా ఇటీవల కాలంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 05:54 PM, Sat - 3 February 24

Rajasthan: దళితులపై అమానుష ఘటనలు ఆగడం లేదు. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు ఏ మాత్రం భయపడటం లేదు. పైగా ఇటీవల కాలంలో దళితులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా రాజస్థాన్ లో అమానుష ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన దళిత యువకుడిపై అగ్రవర్ణ కుర్రాళ్ళు కర్రలు మరియు రాడ్‌లతో దాడి చేసి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడు పబ్లిక్ ప్లేస్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడమే పాపమైంది. ఈ ఘటన జనవరి 26న చోటుచేసుకోగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. 17 ఏళ్ల బాలుడు అనా సాగర్ చౌపతి పార్క్ వద్ద సరదాగా రీల్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన పుష్పేంద్ర, రోహిత్ మరియు గోకుల్ రీల్స్ చేయడం ఆపమని హెచ్చరించారు. దీంతో అక్కడ వాతావరణ పరిస్థితి గొడవకు దారి తీసింది. తాను సొంతంగా రీల్స్ చేసుకుంటుండగా ఈ ముగ్గురు పోకిరీలు రీల్స్ చేయకూడదని చెప్పడం, ఎదురు తిరిగిన బాలుడిపై దాడికి పాల్పడ్డారు. సదరు బాలుడు దళితుడు కావడంతో కర్రలు, రోడ్లతో కొట్టారు. వారిలో ఒకరు మైనర్ బాలుడి చేత మూత్ర విసర్జన బలవంతంగా తాగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో వీడియో వైరల్ గా మారింది. బాధితుడి ఫిర్యాదు మేరకు క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాలుడి తల్లిదండ్రులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.
Also Read: Surya Kanguva : సూర్య కంగువ ఎబ్బే ఇది సరిపోదు సామి..!