Video Viral: చిరుతపులితో ఫుడ్ షేర్ చేసుకున్న తాబేలు.. వీడియో వైరల్?
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వాడకం పెరిగిపో
- Author : Anshu
Date : 04-09-2023 - 3:55 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ లను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ప్రపంచం నలుమూలలా ఏది జరిగినా కూడా అధిక్షణాల్లోనే వైరల్ అవుతూ ఉంటుంది. అలా నిత్యం సోషల్ మీడియాలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో రకాల సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. మనుషులకు జంతువులకు పక్షులకు ప్రకృతికి ఇలా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.
ముఖ్యంగా వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు రోజు కొన్ని వందల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా జంతువులు చేసే ఫన్నీ రియాక్షన్ కు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ తాజాగా సోషల్ మీడియాలో రెండు జీవులకు సంబంధించిన వీడియో ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అన్న విషయానికి వస్తే.. మామూలుగా చిరుత పులులు, సింహాలు వాటి పిల్లలు మాంసాహార జీవులు లేదా ఇతర జీవులు పక్షులు ఏవి కనిపించినా కూడా వాటిని వెంటాడి వేటాడి మరి తింటూ ఉంటాయి.
Cheetah & tortoise share food. Those who give their food give their heart.
📽️Carson Springs Wildlife pic.twitter.com/kf4agZCXOZ
— Hakan Kapucu (@1hakankapucu) August 31, 2023
కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో జరుగుతున్న సంఘటన మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆ వీడియోలో ఒక చీతా ఆహారం తింటూ ఉండగా చీతాతో పాటు తాబేలు కూడా ఎంతో స్నేహపూర్వకంగా ఆహారం తింటూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మామూలుగా జీతాలు తాబేలు వంటివి కూడా కనిపించినా కూడా వెంటనే వాటిని తినేస్తూ ఉంటాయి. అలాగే తాబేలు కూడా చిరుత వంటి వాటికి దొరకకుండా లోపలికి తల కాళ్లు అన్ని పెట్టుకునే వాటికి దొరకకుండా ఉంటాయి. కానీ వీడియోలో మాత్రం అలా లేదు. అయితే ఈ వీడియోలో విభిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు జంతువులు ఒకే పాత్రలోని ఆహారాన్ని ప్రశాంతంగా తింటున్నాయి.