HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Burning Material In This Video Is Ammonium Dichromate It Is Not Kurkure

Fact Check : మండుతున్నది కుర్‌కురే పొడి కాదు.. అమోనియం డైక్రోమేట్

అయితే ఇటీవలే కుర్‌కురేల(Fact Check) పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది.

  • By Pasha Published Date - 09:41 PM, Wed - 25 December 24
  • daily-hunt
Burning Material Ammonium Dichromate Its Not Kurkure Viral Video

Fact Checked By factly

కుర్‌కురే‌లను పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా భారీ సేల్స్ జరిగే తినుబండారాల్లో ఇది ఒకటి. కుర్‌కురే ఫ్లేవర్స్ ఎంతో టేస్టీగా ఉంటాయి. అందుకే పిల్లలు నోరెత్తితే చాలు.. కుర్‌కురే కావాలి అని అడిగేస్తుంటారు. అయితే ఇటీవలే కుర్‌కురేల(Fact Check) పేరుతో ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. కుర్‌కురేలను పొడి చేసి,  ఆ పొడికి నిప్పు పెడితే.. అది ఆగకుండా మండుతున్నట్లుగా వీడియోలో చూపించారు.  దీనిపై ఒక వీడియో (ఇక్కడ & ఇక్కడ)  సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కుర్‌కురే తినడం ప్రమాదకరమని ఆ వీడియో పోస్టులో రాశారు. దీన్ని ఫ్యాక్ట్ చెక్ చేయమని ‘ఫ్యాక్ట్‌లీ’ వెబ్‌సైట్‌ వాట్సాప్ నంబర్ (+91 92470 52470)‌కు అభ్యర్థనలు వెళ్లాయి. దీంతో ఫ్యాక్ట్ చెక్ చేయగా.. నిజానిజాలు వెలుగుచూశాయి.

 

View this post on Instagram

 

A post shared by gopi.manchi.baludu.ponnur.9059408589 (@gopikatta_prabhas.fans.143)

Also Read :Kiara Advani : జానీ మాస్టర్​‌ను పొగిడిన కియారా.. నిప్పులు చెరిగిన నెటిజన్లు

ప్రచారం : కుర్‌కురే పొడికి మండే స్వభావం ఉందని చెబుతూ ఒక వీడియోను చూపించారు.

నిజం : ఒక మండుతున్న పదార్థాన్ని వీడియోలో చూపించారు. అది కుర్‌కురే పొడి కాదు. వాస్తవానికి అది అమోనియం డైక్రోమేట్. దీని  ఫార్ములా (NH4)2Cr2O7). కాబట్టి ఈ పోస్ట్ తప్పు.

వైరల్ వీడియోను తనిఖీ చేయగా అందులో ‘@sarveshtripathimaxscience’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉంది. దీని ఆధారంగా ఈ వీడియో (ఆర్కైవ్)‌ను తొలుత “Sarvesh Tripathi Max science” అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 2024 డిసెంబరు 20న అప్‌లోడ్ చేశారని మేం గుర్తించాం. వారి వెబ్‌సైటులో  ఇచ్చిన సమాచారం ప్రకారం.. అది గుజరాత్‌లోని ఒక విజ్ఞాన కేంద్రం. వివిధ సైన్స్ ప్రయోగాలు చేయడాన్ని అక్కడ విద్యార్థులకు నేర్పిస్తుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Sarvesh Tripathi Max Science (@sarveshtripathimaxscience)

Also Read :Delhi Polls : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడికి మజ్లిస్ టికెట్ ? ఈ మీటింగ్ అందుకేనా ?

ఇక, ఈ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇలాంటి సైన్స్ ప్రయోగాన్నే చూపించే మరిన్ని వీడియోలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) మాకు యూట్యూబ్‌లో కనిపించాయి. అయితే, ఆ వీడియోల్లో ఉపయోగించిన ఈ నారింజ రంగు పదార్థం పేరు అమోనియం డైక్రోమేట్ ((NH4)2Cr2O7) అని పేర్కొన్నారు. ఈ పదార్థానికి మండే స్వభావం ఉంటుం ది. అనేక ప్రయోగశాలల్లో ఈ ప్రయోగాన్ని చేస్తుంటారు. అయితే అమోనియం డైక్రోమేట్‌కు ఉన్న హానికారక స్వభావం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వీడియో గురించి ‘Sarvesh Tripathi Max science’ వారిని మేం సంప్రదించగా..  ఈ ప్రయోగంలో తాము వాడిన పదార్థం అమోనియం డైక్రోమేట్ అని తెలిపారు. ఈ ప్రయోగం కోసం కుర్‌కురేను వాడినట్లు ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు.

చివరిగా.. ఆరోగ్యంపై కుర్‌కురే ప్రభావాన్ని మేం ధృవీకరించనప్పటికీ, వైరల్ వీడియోలో మండుతున్న పదార్థం కుర్‌కురే కాదని తేలింది. అది అమోనియం డైక్రోమేట్ అని నిర్ధారణ అయింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా  ‘factly.in’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ammonium Dichromate
  • Burning Material
  • Fact Check
  • factly
  • Kurkure
  • Shakti Collective
  • viral video

Related News

Teacher's speech at school...sleeping in the classroom under the influence of alcohol

Viral Video : పాఠశాలలో టీచర్‌ నిర్వాకం..మద్యం మత్తులో క్లాస్ రూంలోనే నిద్ర

సుకుత్‌పల్లి గ్రామంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో (AHS) SGTగా పనిచేస్తున్న జే. విలాస్ అనే ఉపాధ్యాయుడు ఇటీవల మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు తెలుస్తోంది. క్లాస్ గదిలో విద్యార్థుల మధ్యలోనే నిద్రలోకి జారుకున్న ఆయన ప్రవర్తన విద్యార్థుల మనోభావాలను కించపరచడమే కాకుండా, ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చేలా మారింది.

  • Harbhajan Singh

    Harbhajan Singh: లలిత్ మోదీపై హర్భజన్ సింగ్ ఆగ్రహం.. కార‌ణ‌మిదే?

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd