Kiara Advani : జానీ మాస్టర్‌ను పొగిడిన కియారా.. నిప్పులు చెరిగిన నెటిజన్లు
తాజాగా 'ధోప్' పాటకు(Kiara Advani) సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ఫొటోలు, వీడియోలను కియారా అద్వాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు.
- By Pasha Published Date - 07:06 PM, Wed - 25 December 24

Kiara Advani : హీరోయిన్ కియారా అద్వానీని పలువురు నెటిజన్లు టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. ఇంతకీ ఎందుకు అంటే.. తాజాగా జానీ మాస్టర్‌పై సోషల్ మీడియా వేదికగా కియారా చేసిన పోస్ట్ వల్లే !! ఆ పోస్ట్‌లో జానీ మాస్టర్‌పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.
Also Read :Delhi Polls : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడికి మజ్లిస్ టికెట్ ? ఈ మీటింగ్ అందుకేనా ?
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తున్నారు. ఈసినిమా జనవరిలో రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించిన ‘ధోప్’ అనే పాటను ఇటీవలే అమెరికాలో విడుదల చేశారు. ఈ సాంగ్‌లో హీరో హీరోయిన్లు చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌పై ట్రోలింగ్ నడుస్తోంది. ఇందుకు కారణం జానీ మాస్టర్ అని అంటున్నారు. తాజాగా ‘ధోప్’ పాటకు(Kiara Advani) సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ ఫొటోలు, వీడియోలను కియారా అద్వాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విడుదల చేశారు. వాటితో ఆమె ఒక మెసేజ్ రాసుకొచ్చారు.
Also Read :Bus Falls Into Gorge : 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిన బస్సు.. ఏమైందంటే..
‘‘గేమ్ ఛేంజర్ మూవీలోని ధోప్ సాంగ్‌ను డైరెక్టర్ శంకర్ చక్కగా షూట్ చేయించారు. ఓ మూవీ సాంగ్ కోసం 13 రోజుల టైం తీసుకోవడం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైమ్. ఈ సాంగ్‌కు సంబంధించిన సెట్‌లో ఉన్నప్పుడు నేను డిస్నీల్యాండ్‌లో ఉన్నట్టుగా ఫీలయ్యాను. జానీ మాస్టర్ కొరియోగ్రఫీని ఆల్‌రెడీ చూసి ఉండడంతో ఈ సాంగ్‌ను ఎలా చేయబోతున్నాం అనే దానిపై ఒక అంచనా ఉండేది. మా పనుల్లో ఉండే అందం అంటే ఇదే. ప్రతిసారి కొత్త విషయాన్ని నేర్చుకోగలుగుతాం. ఈసారి డబ్ స్టెప్/ క్లాసికల్/ రోబోటిక్/ హిప్ హాప్ అన్ని రకాల స్టైల్స్ కలగలసిన డ్యాన్స్ చేశాను. ఎలా ఉందో మీరు కామెంట్స్‌లో చెప్పండి. నాకు తెలిసిన అద్భుతమైన డ్యాన్సర్లలో ఒకరైన రామ్ చరణ్ తో కలిసి డ్యాన్స్ చేయడం అంటే కచ్చితంగా ఫన్‌గా ఉంటుంది” అని తన పోస్ట్‌లో కియారా పేర్కొన్నారు. ఇందులో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్‌తో పాటు జానీ మాస్టర్‌ను ట్యాగ్ చేసింది. అయితే పోక్సో చట్టం కింద కేసును ఎదుర్కొంటున్న వ్యక్తిని తన పోస్టులో కియారా ట్యాగ్ చేయడంతో ఆమెపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో కియారా అద్వానీ తన పోస్టులో నుంచి జానీ మాస్టర్ పేరును తొలగించారు.