Marriage Viral : ముస్లిం యువకుడితో బీజేపీ నేత కుమార్తె పెళ్లి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనామ్ కుమార్తె.. ఒక ముస్లిం యువకుడిని పెళ్లి (Marriage Viral) చేసుకోనుంది.
- Author : Pasha
Date : 20-05-2023 - 9:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే యశ్‌పాల్ బెనామ్ కుమార్తె.. ఒక ముస్లిం యువకుడిని పెళ్లి (Marriage Viral) చేసుకోనుంది. ఈ నెల 28న జరగనున్న ఈ పెళ్లికి సంబంధించిన శుభలేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Marriage Viral) అవుతున్నాయి. యశ్‌పాల్ బెనామ్ కుమార్తె లక్నోలోని ఒక యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ముస్లిం వ్యక్తిని లవ్ చేసిందని .. అది పెళ్లికి దారితీసిందని అంటున్నారు. తన కూతురి పెళ్లికి రావాలంటూ పౌరీ మున్సిపాల్టీ ఛైర్మన్‌గా ఉన్నయశ్‌పాల్ బెనామ్ బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కూడా శుభలేఖలను పంపించారట. పౌరీ సమీపంలోని ఘుద్దౌడిలోని హష్వాన్ అనే రిసార్ట్‌లో ఈ పెళ్లి వేడుక జరుగుతుందని కుటుంబ సన్నిహితులు చెప్పారు.
విశేషమేమిటంటే.. బెనామ్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. 2003లో మొదటిసారి పౌరి మున్సిపాలిటీ అధ్యక్షుడయ్యారు. 2007లో కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో పౌరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2013లో మళ్లీ మున్సిపల్ అధ్యక్షుడిగా ఎన్నికై ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా మూడోసారి మున్సిపల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.