Viral : విమానం రెక్కల్లో పక్షి గూడు
Viral : ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు గమనించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కు చూపించడంతో విషయం బయటపడింది
- By Sudheer Published Date - 01:58 PM, Thu - 26 June 25

ముంబై ఎయిర్‌పోర్టులో శుక్రవారం చోటు చేసుకున్న ఓ అనూహ్య సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమాన రెక్కల (Air India flight wings ) మధ్యలో ఓ చిన్న పక్షి గూడు (Bird’s nest) కనిపించింది. ఓ ప్రయాణికుడు విమానం ఎక్కే ముందు గమనించి ఫోటో తీసి ఎయిర్ హోస్టెస్‌కు చూపించడంతో విషయం బయటపడింది. దీంతో విమాన సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ వెంటనే అప్రమత్తమయ్యారు.
పక్షి గూడు పైలట్‌కు చూపించడంతో, గ్రౌండ్ సిబ్బంది భారీ చర్యలు ప్రారంభించారు. విమానం రెక్కల్లో ఏర్పడిన గూడును తొలగించేందుకు గంటల పాటు శ్రమించారు. చిన్న పక్షి గూడే అయినా, భద్రత పరంగా విమానం టేకాఫ్‌కు ముందు పూర్తిగా పరిశీలించి, గూడులోని చిన్న కర్రలు, ఆకులు తొలగించిన తర్వాతే విమానాన్ని రవాణా చేశారు. ఈ ప్రక్రియలో దాదాపు 3 గంటలు ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.
Heartbreaking Incident : వృద్ధురాలిని చెత్తకుప్పలో వదిలేసిన కుటుంబ సభ్యులు
ఈ సంఘటనతో నెల రోజుల క్రితం అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదాన్ని గుర్తుచేస్తూ, ప్రయాణికులు భయాందోళనకు లోనయ్యారు. విమాన భద్రతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానాశ్రయాల్లో ఈ తరహా ప్రమాదాలను నిరోధించేందుకు పక్షుల నివాసాలను గుర్తించి ముందుగానే చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.
An Air India flight from Mumbai to Bangkok was delayed by 3 hours after a passenger spotted a bird’s nest between the aircraft’s wings.
The passenger alerted the crew, who informed the pilot. Ground staff removed the nest materials before takeoff. 🐦✈️ #AirIndia #FlightDelay pic.twitter.com/rcCMO9HL0s
— Madhuri Adnal (@madhuriadnal) June 26, 2025