Bengaluru : సోషల్ మీడియా లో ప్రియురాలి నగ్న ఫొటోస్ ను పోస్ట్ చేసిన ప్రియుడు..ఎందుకు తెలిస్తే ఛీ..అనకుండా ఉండలేరు
ప్రేమించిన యువతీ నగ్న ఫొటోస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి పైశాచికానందం పొందాలని అనుకున్నాడు..కానీ పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది
- By Sudheer Published Date - 07:22 PM, Thu - 12 October 23

ఈ మధ్య మనుషుల్లో వింత వింత ఆలోచనలు వస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా (Social Media) వాడకం పెరగడంతో రకరకాలుగా ఆలోచిస్తూ..ఏంచేస్తున్నారో..సమాజం ఏమంటుందో..తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందో అనేవి ఆలోచించకుండా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి అలాగే చేసాడు. ప్రేమించిన యువతీ నగ్న ఫొటోస్ (Morphed Pics in social media) ను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి పైశాచికానందం పొందాలని అనుకున్నాడు..కానీ పోలీస్ స్టేషన్ లో ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు వేలూరుకు చెందిన సంజయ్ (Sanjay) (26), బాధిత యువతి (24) ఇద్దరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. పదోతరగతి నుండి ఒకే స్కూల్‌లో చదివారు. విద్యాభ్యాసం తర్వాత జాబ్స్ కోసం బెంగళూరు వచ్చి, ఇరువురు వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాల్లో చేస్తున్నారు. వీరి స్నేహం ప్రేమగా మారడంతో కొన్నాళ్ల నుంచి సహజీవనం చేస్తున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనీ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ ఓ ఆలోచన చేసాడు. ప్రియురాలి ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడితే ఎలాంటి కామెంట్లు వస్తాయో చూడాలని అనుకున్నాడు. దీంతో మార్ఫింగ్ ఫోటోలను టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా లలో ( Man held for Posting morphed pics in Social Media) పోస్ట్ చేసాడు. ఆ తర్వాత తనకేమీ తెలియనట్టు ఆమెను ఓదార్చుతూ.. పోలీస్ స్టేషన్‌కు కలిసి వెళ్లి ఫిర్యాదు చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఏ అకౌంట్ నుంచి ఆ ఫోటోలు పోస్టయ్యాయనే అంశంపై కూపీ లాగారు. చివరకు ఆ అకౌంట్‌ను సంజయ్ ఉపయోగిస్తోన్న విషయం వెలుగుచూసింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో తానే వాటిని పోస్ట్ చేసినట్టు అంగీకరించాడు. తన ప్రియురాలు అందంగా ఉంటుందని, ఆమె నగ్న ఫోటోలకు వచ్చే కామెంట్స్ చూసి ఆనందం పొందడానికే ఆపని చేసినట్టు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. కేవలం ఆమె ఫొటోస్ మాత్రమే కాదు అతడి స్నేహితులు, బంధువులకు చెందిన వందకు పైగా ఇలాంటి మార్ఫింగ్ ఫోటోలు అతడి వద్ద లభించాయి.
ఈ ఫోటోలు మార్ఫింగ్ కోసం బోట్ యాప్‌ను వినియోగించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకొని ఐపీసీలోని 420 సహా, ఐటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్లో పెట్టారు. ఈ వార్త చూసి చాలామంది ఇలాంటి వారు కూడా సమాజంలో ఉంటారా అని అవాక్ అవుతున్నారు.
Read Also : Chandrababu : రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు అలర్జీ.. సెంట్రల్ జైలుకు చేరుకున్న వైద్యులు