Nail Cutter In Stomach : 8 ఏళ్లుగా కడుపులో నెయిల్ కట్టర్.. ఎట్టకేలకు పొట్ట స్కానింగ్ లో కనిపించింది
Nail Cutter In Stomach : అతడు ఏదో ఆవేశంలో.. 8 ఏళ్ల క్రితం గోళ్లు కత్తిరించుకునే నెయిల్ కట్టర్ ను మింగేశాడు.. ఆ తర్వాత ఒక వ్యక్తికి ఆ విషయాన్ని చెబితే.. రెండు అరటి పండ్లు తిను మలంలో బయటికొచ్చేస్తుంది అని ఉచిత సలహా ఇచ్చాడు..
- Author : Pasha
Date : 22-08-2023 - 7:02 IST
Published By : Hashtagu Telugu Desk
Nail Cutter In Stomach : అతడు ఏదో ఆవేశంలో.. 8 ఏళ్ల క్రితం గోళ్లు కత్తిరించుకునే నెయిల్ కట్టర్ ను మింగేశాడు..
ఆ తర్వాత ఒక వ్యక్తికి ఆ విషయాన్ని చెబితే.. రెండు అరటి పండ్లు తిను మలంలో బయటికొచ్చేస్తుంది అని ఉచిత సలహా ఇచ్చాడు..
అతడు చెప్పినట్టుగా అరటి పండు తిన్నాడు..
మరుసటి రోజు ఉదయం మల విసర్జనకు వెళ్లొచ్చి రిలాక్స్ డ్ గా ఫీల్ అయ్యాడు..
ఇక తన కడుపులో నుంచి నెయిల్ కట్టర్ వెళ్లిపోయిందనుకున్నాడు..
Also read : Sleeping: ఎక్కువసేపు నిద్రపోతే ఎన్ని నష్టాలున్నాయో తెలుసా
కట్ చేస్తే.. బెంగళూరుకు చెందిన 38 ఏళ్ల ఆ వ్యక్తికి వారం క్రితం విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో డాక్టర్స్ దగ్గరికి వెళ్లగా పొట్ట స్కాన్ తీయించారు. ఆ స్కాన్ రిపోర్ట్స్ చూసిన డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. అతడి కడుపులో నెయిల్ కట్టర్ ఉందని గుర్తించారు. దీంతో ఆ వ్యక్తి ఆపరేషన్ చేయించుకొని నెయిల్ కట్టర్ ను బయటికి తీయించుకున్నాడు. గత 8 ఏళ్లుగా పొట్టలో ఉండటం వల్ల , అది పూర్తిగా తుప్పు పట్టిపోయింది. అదృష్టవశాత్తు దానివల్ల పేగులకు కోత పడటం కానీ.. మెటల్ ఇన్ఫెక్షన్ సోకడం కానీ జరగలేదని డాక్టర్స్ చెప్పారు. మల విసర్జనలో నెయిల్ కట్టర్ కడుపు నుంచి వెళ్ళిపోయి ఉండొచ్చనే ఫీలింగ్ లో ఉండటం వల్ల .. అతడు గత 8 ఏళ్లు ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని తెలిపారు. ఒకవేళ నెయిల్ కట్టర్ కడుపులో ఉండగా అతడు ఎయిర్ పోర్ట్ కు వెళ్లి ఉంటే.. కచ్చితంగా మెటల్ డిటెక్టర్స్ కు దొరికిపోయి ఉండేవాడని వైద్యులు (Nail Cutter In Stomach) కామెంట్ చేశారు.
Also read : BRS Game : కేసీఆర్ తురుపుముక్కలు ఎర్రన్నలు..!
నెయిల్ కట్టర్ ఎలా మింగాడంటే ?
నెయిల్ కట్టర్ మింగిన ఆ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. “నాకు 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మద్యం అలవాటు బాగా ఉండేది. దీంతో మా పేరెంట్స్ నన్ను అప్పట్లో ఒక డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించారు. ఆ సెంటర్ సిబ్బందితో నేను గొడవపడి కోపంలో నెయిల్ కట్టర్ ను మింగేశాను. అక్కడున్న ఓ వ్యక్తి సలహాతో అరటి పండ్లు తిన్నాను.. మరుసటి రోజు ఉదయం మలంలో కలిసి నెయిల్ కట్టర్ బయటికి వెళ్లిపోయిందని అనుకున్నాను. కానీ అలా జరగలేదని ఇప్పుడు తెలిసింది ” అని వివరించాడు.