99 Employees Fired : మీటింగ్‌కు డుమ్మా.. 99 మంది ఉద్యోగులను తీసేసిన సీఈఓ
మీరు జాబ్‌ను(99 Employees Fired) సీరియస్‌గా తీసుకోలేదు.
- By Pasha Published Date - 02:42 PM, Mon - 18 November 24

99 Employees Fired : ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 99 మంది అకస్మాత్తుగా ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. కాళ్ల కింది భూమి బద్దలయ్యేంత తీవ్రత కలిగిన ఈ విషయాన్ని వాళ్లందరికీ సింపుల్‌గా ‘స్లాక్’ యాప్‌లో మెసేజ్ చేసి చెప్పారు. చెప్పింది ఎవరో కాదు.. స్వయంగా కంపెనీ సీఈఓ. ఇంతకీ ఎందుకింత ఘోరంగా వీళ్లను జాబ్స్ నుంచి తీసేశారు ? చేసిన తప్పేంటి అనుకుంటున్నారా ? అయితే వార్త చదవండి.
Also Read :Delhi Pollution : ఢిల్లీలో ఇక ‘గ్రేప్-4’.. మాకు చెప్పకుండా ఆంక్షలు సడలించొద్దు.. సుప్రీం ఆదేశాలు
పైన మనం చెప్పుకున్న షాకింగ్ ఘటన అమెరికాలో జరిగింది. అదొక మ్యూజిక్ కంపెనీ. అందులో 111 మంది జాబ్ చేస్తున్నారు. వాళ్లందరినీ కంపెనీ సీఈఓ మీటింగ్‌కు పిలిచారు. అయితే కొంతమంది మాత్రమే మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్లంతా వేర్వేరు కారణాలతో డుమ్మా కొట్టారు. ఏం కాదులే అనుకున్నారు. అయితే కంపెనీ సీఈఓ మాత్రం దీన్ని చాలా చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. తన మీటింగ్‌కు హాజరుకాని 99 మంది ఉద్యోగులకు ఆయన ఒక ముఖ్యమైన మెసేజ్‌ను పంపారు. వాళ్లంతా డ్యూటీలో ఉన్న టైంలోనే స్లాక్ యాప్‌లో ఈ మెసేజ్ డెలివరీ అయింది. దీన్ని ఓపెన్ చేసి చూశాక.. ఆ 99 మంది ఉద్యోగులకు చెమటలు పట్టాయి. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. వాళ్లందరికీ తమ ఫ్యూచర్ పెద్ద ప్రశ్నలా కనిపించింది.
Also Read :Nayanthara Birthday : నయనతార బర్త్‌డే సర్‌ప్రైజ్ ‘రక్కయీ’.. ఆమెకు పేరు పెట్టిందెవరు ? రెమ్యునరేషన్ ఎంత ?
‘‘మీరు జాబ్‌ను(99 Employees Fired) సీరియస్‌గా తీసుకోలేదు. మన ఒప్పందం ప్రకారం.. మీరు చేయాల్సిన పనులు పూర్తి చేయలేకపోయారు. కనీసం సమావేశాలకు హాజరుకాలేకపోయారు. అందువల్లే మన మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాను. మా కంపెనీకి సంబంధించి మీ వద్ద ఉన్న వస్తువులను వెనక్కి ఇచ్చి వెళ్లండి. అన్ని అకౌంట్లను వెంటనే సైన్‌ఔట్ చేయండి’’ అని సీఈఓ పంపిన మెసేజ్‌లో ఉండటాన్ని చూసి ఉద్యోగులంతా గాబరా పడ్డారు. ‘‘ మీ జీవితాలను మెరుగుపర్చుకోవడానికి, కష్టపడి పనిచేయడానికి నేను ఛాన్స్ ఇచ్చాను. అయినా మీరు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. 111 మంది ఉద్యోగుల్లో కొందరే నా మీటింగ్‌కు వచ్చారు. కంపెనీలో వాళ్లు మాత్రమే ఉంటారు. మిగిలిన వారిని జాబ్స్ నుంచి తీసేశాను’’ అని ఆ మెసేజ్‌లో ఉంది.
నెటిజన్ల ఆగ్రహం
ఉద్యోగ కోతలు జరిగిన మ్యూజిక్ కంపెనీలో పనిచేసే ఒక ఇంటర్న్ ఈ మెసేజ్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. సీఈఓ స్పందించిన తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సమాచార లోపం వల్లే ఉద్యోగులు సీఈఓ మీటింగ్‌కు గైర్హాజరై ఉండొచ్చని కొందరు కామెంట్ చేశారు. కంపెనీలో ఆధిపత్య పోరు జరుగుతోందేమో అని మరికొందరు డౌట్ వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్థిక కష్టాల్లో ఉండి ఈ నిర్ణయం తీసుకుందేమో అని పలువురు అభిప్రాయపడ్డారు.