Rebekka Blue: వాడిపడేసిన చెత్తతో నెలకు లక్షలు సంపాదిస్తున్న మోడల్?
సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులను తిరిగి వాటిని మళ్లీ సేల్స్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ
- By Nakshatra Published Date - 04:06 PM, Thu - 13 April 23
సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులను తిరిగి వాటిని మళ్లీ సేల్స్ చేస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వస్తువులు అసలు దొరకన్నా రెట్టింపు ధరకు పలుకుతూ ఉంటాయి. అభిమానులు వాటిని పెద్ద మొత్తంలో ఖర్చు చేసి అయినా కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలు వాడిన బట్టలు, జ్యువలరీ, వాచ్‌లు, వాహనాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లో భారీ ధరకు అమ్ముడుపోతూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే అమెరికాకు చెందిన ఒక మోడల్ మాత్రం గోర్ల క్లిప్పింగ్స్, పాదాల చర్మం, డాండ్రఫ్ వంటివి అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తోంది. అదేంటి అనుకుంటున్నారా..
పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా నార్త్ కరోలినాలో చెందిన రెబెక్కా బ్లూ గతంలో ఎగ్జోటిక్ డ్యాన్సర్‌గా చేసింది. కాగా ఆమె ప్రస్తుతం వెబ్‌క్యామ్ మోడల్, ఇన్ఫ్లూయెన్సర్గా ఉంటోంది. అయితే ఈమె తన వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తూ కావాల్సినంత డబ్బు సంపాదిస్తోంది. మొదట్లో తన స్ట్రిప్పింగ్ అవుట్ ఫిట్స్‌ను ఒక వ్యక్తికి 20 డాలర్లకు విక్రయించింది. ఈ విధంగా మొదలుపెట్టిన తన వ్యాపారాన్ని అంతకంతకు పెంచుకుంటూ కొన్ని లక్షలు సంపాదిస్తోంది. ఆమె దగ్గర ఉన్న వస్తువులకు భారీగా డిమాండ్ ఉంది అన్న విషయాన్ని గమనించి ఆమె కూడా బిజినెస్ ను ప్రారంభించింది. అలా కేవలం 28 ఏళ్లకే ఆమె బిలీనియర్ అయిపోయింది.
మొదట సాక్స్ వంటి వాటిని విక్రయించడం మొదలు పెట్టి ఇప్పడు ఉమ్మి, కాలి గోర్లు, పాదాల నుంచి కత్తిరించిన చర్మం, తన ఇంట్లోని చెత్త, కాటన్ స్వాబ్స్, ఇతర చిత్రవిచిత్రమైన వస్తువుల్ని కూడా విక్రయిస్తోంది. వీటి ద్వారా భారీగానే డబ్బులు సంపాదిస్తోంది. అయితే కేవలం ఈమె మాత్రమే కాకుండా గతంలో కూడా చాలామంది సెలబ్రిటీలు ఈ విధంగా వస్తువులను విక్రయించారు. అయితే ఈమెకు ఈ వ్యాపారం బాగా కలిసి రావడంతో పెద్ద ఎత్తున డబ్బులను సంపాదిస్తోంది. ప్రస్తుతం రెబెక్కా బ్లూ ఇలాంటి చిన్న చిన్న పనికిరానివన్నీ విక్రయిస్తూ నెలకు 2000 డాలర్లు సంపాదిస్తోంది. అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం నెలకు దాదాపుగా రూ.1.60 లక్షల కంటె ఎక్కువగానే సంపాదిస్తోంది..
Related News
Hair Tips: వారానికి ఒక్కసారి ఇలా చేస్తే చాలు చుండ్రు సమస్య మళ్ళీ రమ్మన్నా రాదు!
ఈ రోజుల్లో చాలామంది చుండ్రు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ చుండ్రు సమస్య కారణంగా చాలామంది తెగ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ