Rs 230 Crores Slippers : హీరోయిన్ చెప్పుల జత.. వేలంలో రూ.230 కోట్లకు కొనేశాడు
అమెరికాలో ఈమెకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’(Rs 230 Crores Slippers) అనే మూవీలో నటించే క్రమంలో ఈమె రూబీ చెప్పులను ధరించారు.
- Author : Pasha
Date : 08-12-2024 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Rs 230 Crores Slippers : డిఫరెంటుగా ఉన్న వస్తువులకు, సెలబ్రిటీలు వినియోగించిన వస్తువులకు, అరుదుగా లభించే వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది. ప్రత్యేకించి ఇలాంటి వస్తువులకు విదేశాల్లో తరుచుగా వేలంపాటలు నిర్వహిస్తుంటారు. ఆసక్తి కలిగిన బిలియనీర్లు, మిలియనీర్లు ఇలాంటి వస్తువులను సేకరించి తమ ఇళ్లలో డిస్‌ప్లే చేసుకుంటారు. తమ ఇళ్ల ఇంటీరియర్‌ను మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇలాంటి అరుదైన వస్తువులను వాడుకుంటారు. వేలంపాటల్లో కోట్లు కుమ్మరించి మరీ అరుదైన వస్తువులను సొంతం చేసుకుంటుంటారు. ఇలాంటిదే ఒక సంచలన వేలం పాట ఇటీవలే జరిగింది.
Also Read :Messages Reminder : వాట్సాప్‌లో చూడని మెసేజ్‌లను గుర్తుచేసే ఫీచర్
జూడి గర్లాండ్ .. ఈమె అమెరికాకు చెందిన యాక్టర్. గర్లాండ్ సింగర్ కూడా. నటిగా, సింగర్‌గా ఈమె బాగానే సంపాదించింది. అమెరికాలో ఈమెకు పెద్దసంఖ్యలో అభిమానులు ఉన్నారు. ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’(Rs 230 Crores Slippers) అనే మూవీలో నటించే క్రమంలో ఈమె రూబీ చెప్పులను ధరించారు. అనంతరం ఆ చెప్పులను మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 20 ఏళ్ల కిందట (2005 సంవత్సరంలో) ఈ చెప్పులు చోరీకి గురయ్యాయి. దీనిపై ఏకంగా అమెరికా జాతీయ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐతో విచారణ చేయించారు. ఎట్టకేలకు ఎఫ్‌బీఐ అధికారులు ఆ చెప్పులను 2018లో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఇటీవలే ఆ చెప్పులకు వేలంపాట నిర్వహించారు. ఎవరో గుర్తుతెలియని ఔత్సాహికుడు ఈ చెప్పుల జతను ఏకంగా రూ.237 కోట్లకు కొనేశాడు.
Also Read :Mysterious UFO : అమెరికాలో యూఎఫ్ఓల కలకలం.. ఏలియన్లు దిగి వచ్చాయా ?
పాత చెప్పుల కోసం ఇంత ధర పెట్టి కొనడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అదే డబ్బుతో ఎంతోమంది పేదలకు ఉపాధి కల్పించే ప్రాజెక్టును చేపడితే బాగుండేదని సలహా ఇస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాల్లో చాలామంది శ్రీమంతులు ఉన్నారు. వారు తరుచుగా ఇలాంటి వేలం పాటల్లో పాల్గొంటుంటారు. అంతేకాదు.. కొంతమంది అరబ్ రాజవంశాల వాళ్లు కూడా తమ బినామీల ద్వారా ఇలాంటి అరుదైన వస్తువులను కొనుగోలు చేయిస్తుంటారు. తమ విలాసవంతమైన జీవితం గురించి బయటపడకుండా బినామీలను వాడుకుంటారు.