Gujarat Narnia : గుజరాత్ తీరంలో ‘నార్నియా’ మూవీ సీన్ నిజమైన వేళ..
Gujarat Narnia : సముద్ర తీరంలో సింహం.. అనగానే మనకు ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ మూవీ సీన్ గుర్తుకు వస్తుంది.
- By Pasha Published Date - 02:48 PM, Sun - 1 October 23

Gujarat Narnia : సముద్ర తీరంలో సింహం.. అనగానే మనకు ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ మూవీ సీన్ గుర్తుకు వస్తుంది. గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో నార్నియా సీన్ రియల్ గా రిపీట్ అయింది. సముద్ర తీరం వద్ద గంభీరంగా, నిలకడగా నిలబడిన సింహం ఫొటో ఒక దాన్ని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కశ్వన్ ఆదివారం ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘‘గుజరాత్ తీరంలో అరేబియా సముద్రం అందాలను ఆస్వాదిస్తున్న సింహం’’ అని ఈ ఫొటోకు ఆయన క్యాప్షన్ పెట్టారు. జునాగఢ్ సీసీఎఫ్ నుంచి ఈ ఫొటో తీసుకున్నట్లు పోస్టులో ప్రస్తావించారు
Also read : Swacchata Hi Seva 2023: రెజ్లర్ అంకిత్ తో ప్రధాని మోడీ స్వచ్ఛత కార్యక్రమం
మహాసముద్రం బ్యాక్‌డ్రాప్‌లో మృగరాజు ఉన్న ఈ ఫొటో అదుర్స్ అంటూ నెటిజన్స్ కితాబిచ్చారు. ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా మూవీలోని ఐకానిక్ సినిమాటిక్ మూమెంట్ మళ్లీ గుర్తుకొచ్చిందని ఇంకొందరు వ్యాఖ్యానించారు. నార్నియా నిజంగానే ఇండియాలో కనిపించిందని ఇంకొందరు కామెంట్స్ పెట్టారు.
When #Narnia looks real. A lion king captured enjoying tides of Arabian Sea on Gujarat coast. Courtesy: CCF, Junagadh. pic.twitter.com/tE9mTIPHuL
— Parveen Kaswan (@ParveenKaswan) October 1, 2023