Bathing With a Bikini : గంగానదిలో బికినీతో స్నానం.. ఏంట్రా ఇది..?
Bathing With a Bikini : ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీ ధరించి గంగానదిలో స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
- By Sudheer Published Date - 10:16 AM, Wed - 22 October 25

ఉత్తరాఖండ్‌లోని ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం రిషికేశ్‌లో ఓ విదేశీ పర్యాటకురాలు బికినీ ధరించి గంగానదిలో స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూలదండలు మెడలో వేసుకుని, గంగానదిలో ఈత కొడుతున్న ఆ పర్యాటకురాలిని చూసి కొందరు స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటన కేవలం ఒక వ్యక్తిగత చర్యగా ఉన్నప్పటికీ, పవిత్ర గంగానదిలో బికినీతో స్నానం చేయడం సరైనదా కాదా అనే చర్చ సోషల్ మీడియాలో వేడెక్కింది. గంగా తీరాన్ని ఆధ్యాత్మికత, సంస్కృతి ప్రతీకగా భావించే వారు దీన్ని “సంప్రదాయాలకు విరుద్ధం”గా అభివర్ణిస్తున్నారు.
Jubilee Hills Bypoll: ప్రచార బరిలో బిగ్ బుల్స్..ఇక దూకుడే దూకుడు
మరోవైపు కొందరు నెటిజన్లు ఈ ఘటనలో తప్పేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. “గంగలో పురుషులు కూడా ఇన్నర్వేర్‌లో స్నానం చేస్తారు, అప్పుడు మహిళ బికినీతో స్నానం చేయడంలో తప్పేంటి?” అని వారు ప్రశ్నిస్తున్నారు. గంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే ప్రదేశం కావడంతో, విదేశీ పర్యాటకులు తమ దేశ సంస్కృతి ప్రకారం దుస్తులు ధరిస్తే దానిని నిందించడం సరికాదని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఆ ప్రదేశం పవిత్రతను కాపాడడం అందరి బాధ్యత అని స్థానికులు చెబుతున్నారు.
ఇక అధికార వర్గాలు మాత్రం ఇలాంటి సంఘటనలు తిరిగి జరగకుండా నియమాలు కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నాయి. పుణ్యక్షేత్రాల ప్రత్యేకతను పరిరక్షించేందుకు గంగా తీరం వద్ద స్నానానికి సంబంధించిన డ్రెస్ కోడ్ లేదా మార్గదర్శకాలు తీసుకురావాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ ఘటన భారతీయ సంస్కృతి, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సమతుల్యతపై మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చింది. పర్యాటకులు ప్రాంతీయ ఆచారాలు, ఆధ్యాత్మికతకు గౌరవం చూపుతూ ప్రవర్తించడం అవసరమని సామాజిక వర్గాలు సూచిస్తున్నాయి.