Doctor Rape Case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో 90 ఏళ్ల వృద్ధురాలు కొవ్వొత్తితో నిరసన
ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ వద్ద జరిగిన మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి.ఈ బాధాకరమైన సంఘటన గురించి తెలుసుకున్న 90 ఏళ్ళ వృద్ధురాలు తన మనుమరాలు మరియు మేనకోడళ్లతో కలిసి క్యాండిల్ తో నిరసన తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 12:51 PM, Sat - 17 August 24

Doctor Rape Case: కోల్‌కతా డాక్టర్ హత్య కేసులో 90 ఏళ్ల వృద్ధురాలు కొవ్వొత్తితో నిరసన తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 90 ఏళ్ల వయస్సులోనూ ఆమె దృఢ నిశ్చయంతో నడిచారు. కోల్‌కతాలోని జోకా ప్రాంతంలో నివసించే ఆమె వృద్ధ వయసులో ఉన్నప్పటికీ 3 కి.మీ మేర ఆమె కొవ్వొత్తితో నడిచి డాక్టర్ అత్యాచారానికి నిరసన తెలిపింది.
ఆగస్టు 9న ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ వద్ద జరిగిన మహిళా వైద్యురాలిపై అత్యాచారం మరియు హత్యకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ రోజు దేశవ్యాప్తంగా వైద్యానికి సంబందించిన అన్ని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు తమ నిరసనను తెలియజేస్తున్నాయి.ఈ బాధాకరమైన సంఘటన గురించి తెలుసుకున్న వృద్ధురాలు తన మనుమరాలు మరియు మేనకోడళ్లతో కలిసి నిరసన తెలిపారు. నిరసన పోస్టర్లను చూసిన ఆమె చలించిపోయింది. “ఇది నా జీవితంలో నేను విన్న అత్యంత భయంకరమైన మరియు కలవరపెట్టే సంఘటన” అని ఆమె చెప్పింది. మహిళలు ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెడుతున్నారు, కానీ మనం వారికి భద్రత ఇవ్వలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. మా కుటుంబంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు, వాళ్లంతా ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరూ వెళ్లకపోయినా నేను ఖచ్చితంగా క్యాండిల్ తీసుకొని ఈ మార్చ్‌లో భాగమవుతానని నిర్ణయించుకున్నాను అని ఆమె తెలిపింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ఈ సంఘటన తనలో ఏదో విచ్ఛిన్నం చేసింది. తన కుటుంబంలోని ఆడపిల్లల భద్రత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన గురించి విన్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ రోజు నా రక్తపోటు కూడా పెరిగింది. మనం ఎటువైపు వెళ్తున్నామో అర్థం కావడం లేదు. నాగరిక ప్రపంచంలో ఇంత అసహ్యకరమైన సంఘటన జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాల భవిష్యత్తు గురించి నేను చాలా ఆందోళన చెందుతున్నాను అని అన్నారు.
అలాగే తన మనవరాలు మరియు మేనల్లుళ్ల నుండి ప్రతిరోజూ ఈ విషయానికి సంబంధించిన అప్‌డేట్‌లను పొందుతానని, అలాగే ‘రీక్లెయిమ్ ది నైట్’ నిరసన గురించి కూడా ఆమెకు సమాచారం వచ్చిందని ఆమె చెప్పింది. ఆ అమాయక వైద్యురాలు ఆత్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. స,సమాజంలో ఎవరికైనా అలాంటి అన్యాయం జరిగినప్పుడు మనం అవసరమైనప్పుడల్లా స్వరం పెంచి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు.
Also Read: Raksha Bandhan 2024: రక్షాబంధన్ రోజు శివున్ని పూజించే విధానం ఇదే..!